ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర నిధులపై శ్రద్ధ ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 18: రెండు రోజుల పాటు జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సులో కొంతమంది అధికారుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలకు అధికారులు కంగు తిన్నారు. అయితే గ్రామీణాభివృద్ధి శాఖను మాత్రం సీఎం మెచ్చుకోవడం విశేషం. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద నిధులు రాబట్టడంలో తగిన శ్రద్ధ చూపకపోవడంపై అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనంతరాము తీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన నుంచి ప్రభుత్వానికి ఎప్పుడూ నెగిటివ్ కంట్రిబ్యూషనే ఉంటుందని వ్యాఖ్యానించారు. అటవీశాఖలో అనేక అవకాశాలు ఉన్నాయని, వెలికి తీసేందుకు కృషి చేయాలని హితవు పలికారు. నిధులు రాబట్టేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ కన్నబాబు పనితీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర నుంచి రావాల్సిన నిధులు వచ్చేలా చూడటంలో సరిగా వ్యవహరించకపోవడాన్ని తప్పుబట్టారు. కేంద్రం నుంచి వివిధ ప్రాజెక్టుల నిమిత్తం 2500 కోట్ల రూపాయలు మంజూరు కాగా, అందులో 1000 కోట్ల రూపాయలను పురపాలక శాఖ కేటాయించింది. అయితే ఈ నిధులను ఖర్చు చేసి యుటిలైజేషన్ సర్ట్ఫికెట్ పంపకపోవడం వల్ల నిధుల విడుదల్లో జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని, అసలే ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఇలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. పట్టించుకోకపోతే, ఆ నిధులు పోగొట్టేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్లతో కఠినంగా వ్యవహరించాలని, సకాలంలో పనులు చేయకపోతే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. పశుసంవర్థక శాఖ పనితీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఎన్ని పశువులు ఉన్నాయో? చెప్పలేకపోతున్నారన్నారు. కలెక్టర్ల సదస్సులో సీఎం చేసిన వ్యాఖ్యలతో అధికారులు కంగుతిన్నారు. కాగా, గ్రామీణాభివృద్ధి శాఖ పనితీరును సీఎం మెచ్చుకున్నారు. ఇప్పటికే అనేక అవార్డులు ఆ శాఖకు వచ్చాయని గుర్తు చేశారు. వీటిని చూసి మిగిలిన శాఖలు తాము అవార్డులు సాధించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఉపాధి పథకం కింద సంపద సృష్టిస్తూ, గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారంటూ కితాబిచ్చారు.