ఆంధ్రప్రదేశ్‌

తెలుగుజాతిపై చెరగని ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 18: తెలుగుజాతిపై దివంగత నేత ఎన్టీ రామారావు చెరగని ముద్రవేశారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు, మంత్రులు నివాళులర్పించారు. గుంటూరులోని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గురువారం ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్దఎత్తున రక్తదానం చేశారు. తొలుత పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రులు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ పెనుమార్పులు తీసుకువచ్చారన్నారు. సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పేదలకు కూడు, గూడు, నీడ కల్పించారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన కిలో రెండు రూపాయల పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. మద్యనిషేధం, మహిళా సాధికారతకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. సంక్షేమఫలాలు పేదల దరిచేర్చింది టీడీపీయే అన్నారు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవ్యాంధ్ర అభివృద్ధికి అహరహం శ్రమిస్తున్నారని తెలిపారు. పార్టీ వ్యవస్థాపించిన 9 నెలల్లోనే ఓ ప్రభంజనం సృష్టించిందని ఆయన వేసిన బీజం వేళ్లూనుకుని ఇప్పుడు కోటి మంది కార్యకర్తలతో మహా వృక్షంగా మారిందన్నారు. మరో మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు పేదల అభ్యున్నతికి అనేక పథకాలు అమలుచేసిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడన్నారు. ఆపదలో ఉన్న అన్నార్తులను ఆదుకోవటంతో పాటు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు భరోసా కల్పించారన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చలనచిత్ర, రాజకీయ రంగాలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రమణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్వీఎస్‌ఆర్‌కె ప్రసాద్, గృహనిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య, గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర మీడియాసెల్ కన్వీనర్ దారపనేని నరేంద్ర, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పరిటాల సునీత రక్తదానం చేశారు.
చిత్రం..ఎన్టీఆర్‌కు నివాళులర్పిన్న కళా వెంకట్రావు