ఆంధ్రప్రదేశ్‌

రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ఇతర రాష్ట్రాల ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 18: ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, సమర్థంగా అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి దేశంలోని పలు రాష్ట్రాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) అహ్మద్ బాబు తెలిపారు. శిక్షణలో ఉన్న 17 మంది యువ ఐఎఎస్ అధికారులు ‘్భరత్ దర్శన్’ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ పొందుతున్నారు. వారు సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ సెంటర్‌ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ సీఈఓ ఎ బాబు వారికి రియల్ టైమ్ గవర్నెన్స్ పనితీరు గురించి వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను ఉపయోగించుకుని పీపుల్స్ ఫస్ట్, రియల్ టైమ్ గవర్నెన్స్, ఈ ప్రగతి, భూధార్ లాంటి అనేక ఈ - పరిపాలన పద్ధతులను అనుసరిస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుపుతున్నారని తెలిపారు. ఆసియా దేశాల్లో ఎక్కడా లేని విధంగా 62 అడుగుల పొడవైన వీడియో వాల్‌ను ఆర్జీజీఎస్‌లో ఏర్పాటు చేశామన్నారు. ప్రజాసాధికార సర్వే పీపుల్స్ హబ్‌ను నిర్వహిస్తూ ప్రభుత్వం నుంచి పౌరులకు కావాల్సిన సేవలను అందజేస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆర్టీజీఎస్ నేతృత్వంలో పని చేసే పరిష్కార వేదిక 1100 కాల్ సెంటర్ చాలా ప్రత్యేకతలున్నాయన్నారు. ఇక్కడ 750 మంది సిబ్బంది 24 గంటల పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి అవి నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారన్నారు. ఈ కాల్ సెంటర్ నుంచి రోజుకు 15లక్షల కాల్స్ మాట్లాడవచ్చన్నారు. ఇక్కడ రోజుకు 5వేల గంటల సంభాషణలు రికార్డు చేస్తుంటారని తెలిపారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఒకే సారి లక్ష మందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సదుపాయం ఉందన్నారు. సర్వైలెన్స్ కెమెరాల వల్ల భద్రత మాత్రమే కాకుండా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలుగుతామన్నారు. రాష్ట్రంలో మొత్తం 50వేల సర్వైలెన్స్ కెమెరాలు చేయాలని ప్రభుత్వ లక్ష్యమన్నారు. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆర్టీజీఎస్ పనితీరును అక్కడ ప్రదర్శిస్తున్నామని తెలిపారు.