ఆంధ్రప్రదేశ్‌

సమ్మెకు సిద్ధమంటున్న ఎన్‌ఎంయూ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 18: గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి రావాల్సిన పేస్కేల్స్‌ను వెంటనే అమల్లోకి తీసుకురావాలని, 60రోజుల సమైక్యాంధ్ర సమ్మె కాలానికి ప్రత్యేక సెలవును వెంటనే అమలు జరపాలనే మొత్తం 38 అపరిష్కృత డిమాండ్లపై యాజమాన్యం తక్షణం స్పందించని పక్షంలో ఏ క్షణాన అయినా నిరవధిక సమ్మెకు దిగాల్సి వస్తుందంటూ ఏపీఎస్‌ఆర్టీసీ గుర్తింపుసంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు హెచ్చరించారు. సమ్మెకు ముందస్తు హెచ్చరికగా రెండురోజులపాటు చేపట్టిన ధర్నాలు, ప్రదర్శనలు రాష్ట్రంలోని 128 డిపోల్లో విజయవంతంగా జరిగాయి. సంఘ చైర్మన్ ఆర్‌వివిఎస్‌డి ప్రసాద్, అధ్యక్షుడు సి.చంద్రయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ పివి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు, ముఖ్య ఉపాధ్యక్షుడు డి.సూర్యప్రకాష్‌రావు తదితరులు వేర్వేరు ప్రాంతాల్లో పాల్గొని తమ గళం విప్పారు. తమ డిమాండ్లపై గత డిసెంబర్‌లోనే వినతిపత్రం అందజేసినప్పటికీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన కన్పించనందున తాము రోడ్డెక్కాల్సి వస్తుందన్నారు. ఈ రెండు రోజుల ధర్నా అనంతరం రాష్ట్ర కార్యవర్గం సమావేశంపై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నదని శ్రీనివాసరావు తెలిపారు.