రాష్ట్రీయం

ఎందుకు ఆగాయంటే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14 : నైరుతీ రుతుపవనాలు ఇప్పటికే తెలంగాణ, కోస్తాంధ్ర జిల్లాలను చుట్టుముట్టి మహారాష్టల్రోకి విస్తరించాల్సి ఉన్నా, అది జరగలేదు. సాధాణంగా అరేబియా సముద్రం, బంగాళాఖాతం వైపు నుండి తేమ రావలసి ఉంటుందని, అదే సమయంలో గాలుల వేగం 15 నుండి 20 నాట్స్‌తో ఉండాలని హైదరాబాద్‌లోని ఐఎండి శాస్తవ్రేత్త నాగరత్న తెలిపారు. మంగళవారం ఆమె ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ రుతుపవనాల రాకకు కొన్ని అంశాలు (క్రైటీరియా)ను పరిశీలిస్తుంటామని, అవి ఐఎండి స్టాండర్డ్స్ ప్రకారం ఉంటే రుతుపవనాలు విస్తరించినట్టు ప్రకటిస్తామన్నారు. ఇదే సమయంలో తూర్పు భారత్‌లోకి నైరుతీ రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయని వివరించారు. ఈనెల 9న కేరళలో ప్రవేశించినట్టు ప్రకటించామని, తర్వాత 12న రాయలసీమ వరకు విస్తరించినట్టు ప్రకటించామన్నారు. ప్రస్తుతం బంగాళాఖాతం, అరేబియా సముద్రం వైపు నుండి తేమ వేగంగా రావడం లేదని, గాలులు కూడా లేవన్నారు. ఇలా ఉండగా తెలంగాణ, కోస్తాంద్ర, ఉత్తర కర్నాటక, గోవా, మహారాష్ట్ర, మరాట్వాడా ప్రాంతాలకు నాలుగైదు రోజుల్లో విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నట్టు ఐఎండి శాస్తవ్రేత్త శంభు రవీంద్రన్ ప్రకటించారు. గత 24 గంటల్లో తూర్పుగోదావరి, విజయనగరం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కర్నాటక, కేరళ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి.