తెలంగాణ

తెలుగు వారి గుండెచప్పుడు: బాలకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్‌కు నారా భువనేశ్వరి, సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ, హరికృష్ణ, నారా బ్రాహ్మణి, ఎన్టీఆర్ భార్య నందమూరి లక్ష్మీపార్వతి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు వెళ్లి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు, లెజండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ప్రారంభించారన్నారు. ఆంధ్రాలో 103 కేంద్రాల్లో, తెలంగాణలో 30 కేంద్రాల్లో ఫేస్ బుక్ సహకారంతో ఇతర రాష్ట్రాల్లో కలిపి 140 కేంద్రాల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని నారా భువనేశ్వరి కోరారు. వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. భారతదేశంలో అవసరమున్న ర క్తంలో 50 శాతం మాత్రమే అందుబాటులో ఉందన్నారు. మిగతా 50 శాతం లోటు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సీఈవో టి విష్ణువర్ధన్, హేమ బూదరాజు తదితరులు మాట్లాడారు. తెలుగుతనానికి నిలువెత్తురూపం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మార్చిలో ఎన్టీఆర్ బయోపిక్
ప్రారంభం: బాలకృష్ణ
వచ్చే మార్చిలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. తెలుగువారి గుండెచప్పుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు. తెలుగు ఖ్యాతి, గౌరవాన్ని, చరిత్రను ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కృషి చేస్తానన్నారు. దేశం గర్వించే విధంగా బయోపిక్ సినిమా నిర్మిస్తానని ఆయన చెప్పారు.
‘ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకున్నది కుటుంబ సభ్యులే‘
ఎన్టీఆర్ ఘాట్‌లో సమాధికి పూలమాలతో నివాళులు అర్పించిన తర్వాత నందమూరి లక్ష్మీపార్వతి విలేఖర్లతో మాట్లాడుతూ ఎన్టీరామారావుకు భారతరత్న ఇవ్వాలన్నారు. ఈ విషయమై పార్టీలకు అతీతంగా అందరూ కృషి చేయాలన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమా తీస్తే ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయం ఘట్టాలనుకూడా చిత్రీకరించి చూపించాలన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకపోవడం బాధాకరమన్నారు. ఎన్టీఆర్ జీవితం గురించి ఆయన కుటుంబ సభ్యులు, వారసులకు కూడా తెలియని అనేకవిషయాలు ఉన్నాయన్నారు. తన బాధను ఎన్టీఆర్ తనతో పంచుకున్నారన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా చేయడంలో కుటుంబ సభ్యులే ఉన్నారన్నారు.

చిత్రం..ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తున్న నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, కుటుంబ సభ్యులు