ఆంధ్రప్రదేశ్‌

నకిలీ నక్సలైట్లు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదిలి,జనవరి 18: నలుగురు నకిలీ నక్సలైట్లను పొదిలి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గురువారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు చెందిన బి రాంబాబు, పి శ్రీను, ఎం గడిసెం, పి రాజశేఖర్ అనే నలుగురు తాము నక్సల్స్‌గా పలువుర్ని బెదిరిస్తూ వారినుండి నగదును తీసుకుంటున్నారని ఈ తరహాలో వరంగల్, పాల్వంచ, ఇల్లెందు తదితర ప్రాంతాల్లో గతంలో పలువుర్ని బెదిరించి జైలుపాలయ్యారన్నారు. వారు తమ ప్రవర్తన మార్చుకోకుండా ఈనెల 15న పొదిలికి సమీపంలోని రాజుపాలెం గ్రామరోడ్డులోని ఒక ఇటుకల బట్టి యజమానిని తాము నక్సల్స్ పరిచయం చేసుకుని డబ్బు డిమాండ్ చేశారన్నారు. యజమాని ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించామని, బుధవారం నకిలీ నక్సల్స్ పట్టణ శివారు ఎస్‌వికెపి డిగ్రీకాలేజి ప్రాంగణం ప్రాంతంలో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు.