ఆంధ్రప్రదేశ్‌

‘కోల్డ్ చైన్ కార్పొరేషన్’ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 18: రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కోల్డ్ చైన్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డెయిరీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా విధానాన్ని రూపొందించాలని, దేవాలయాల్లో గోశాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఉండవల్లిలోని సీఎం నివాసం సమీపంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్సు హాల్‌లో రెండు రోజల జిల్లా కలెక్టర్ల సదస్సును సీఎం గురువారం ప్రారంభించారు. తొలిరోజున ప్రాథమిక రంగాలపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ రైతుల ఆదాయం పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని గుర్తు చేశారు. ఇందులో భాగంగా కోల్డ్ చైన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు గతంలో నిర్ణయించామన్నారు. అయితే కోల్డ్ చైన్ కార్పొరేషన్‌ను కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టారంటూ వ్యాఖ్యానించారు. వృద్ధి రేటు సాధించేందుకు వీలుగా 21 రంగాలను గుర్తించామన్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. సంప్రదాయ వ్యవసాయ విధానాలతో ప్రయోజనం లేదని, పంటల మార్పిడితో ఫలితాలు సాధించవచ్చన్నారు.
రాయలసీమను ఉద్యాన హబ్‌గా మార్చాలని భావిస్తున్నామని, ఇందుకు అవసరమైన వాతావరణం కల్పించాలన్నారు. కోల్డ్ స్టోరేజీ, ప్రొసెసింగ్, మార్కెటింగ్, వంటి వసతులు కల్పించాలని, దీంతో మరింతగా పెట్టుబడలను ఆకర్షించవ్చన్నారు. ఈ రంగం అభివృద్ధి చేసేందుకు వీలుగా అవసరమైన రాయితీలు ఇచ్చేందుకు వీలుగా ఒక విధానాన్ని తీసుకురావాలని ఆదేశించారు. డెయిరీ, మాంసం, పౌల్ట్రీ రంగాలను గ్రోత్ ఇంజన్లుగా గుర్తించాలన్నారు. డెయిరీ రంగంలో భారీ పెట్టుబడులు ఆకర్షించేందుకు వీలుగా పరిశ్రమల శాఖ ఒక పాలసీని రూపొందించాలన్నారు. గొర్రెల కాపరులను భాగస్వాములుగా చేసి, మాంస ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేందుకు కూడా విధానాన్ని రూపకల్పన చేయాలన్నారు. టీటీడీలో 100 కోట్ల రూపాయలకు పైగా ఉన్న గో పరిరక్షణ నిధులను ఉపయోగించుకుని, ఆలయాల్లో గోశాలలను అభివృద్ధి చేయాలన్నారు. గోశాలలను ప్రకృతి వ్యవసాయానికి అనుసంధానం అయ్యేలా చూడాలన్నారు.
గో సంరక్షణకు దాతలు ముందుకు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో పశువుల సంఖ్యను లెక్కించాలని, తగినంత పశుగ్రాసం లభించని పశువులను గుర్తించాలన్నారు. ఆ పశువులకు సంబంధించిన పేద రైతులకు 50 శాతం రాయితీతో పశుగ్రాసం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనిపై దృష్టి సారించాలన్నారు. ఎరువులు , పురుగు మందుల వినియోగం తగ్గించాలని, దీని వల్ల భూసారం పెరుగుతుందన్నారు. హెక్టారుకు 226 కిలోల ఎరువులు వినియోగిస్తూ దేశంలో ఆరవ స్థానంలో ఉన్నామన్నారు. సాయిల్ హెల్త్‌కార్డు సిఫారసు ఆధారంగా ఎరువులు ఇవ్వాలన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని స్థిరీకరించాలని సూచించారు. రెయిన్ గన్స్ వినియోగించకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు.
పరికరాలను వినియోగంతో నీటి వినియోగం తగ్గుతుందన్నారు. వ్యవసాయం నుంచి ఉద్యాన పంటల వైపు రైతులు మళ్లడం వల్ల రైతుల ఆదాయం ఏ మేరకు పెరిగిందో నిపుణులతో అధ్యయనం చేయించాలని సూచించారు. వ్యవసాయ రంగ వృద్ధి రేటు 30శాతానికి మించాలని ఆదేశించారు. పశువుల హాస్టళ్లను ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలన్నారు. దేశవాళీ వ్యవసాయానికి అనువైన పశువులు 35 శాతం మాత్రమే ఉన్నాయని, వీటిని ప్రకృతి వ్యవసాయానికి జోడించాలన్నారు. అక్వా పరిశ్రమ వల్ల కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రించాలని, ఇందుకు విదేశాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు అధ్యయం చేసి, ఇక్కడ అమలు చేయాలన్నారు. అంతకుముందుక కేంద్రం నుంచి ఎక్కువగా రావాల్సిన నిధులపై సమీక్ష చేశారు. గత ఏడాది కంటే 3300 కోట్ల రూపాయలు ఈ ఏడాది ఎక్కువగా రాబట్టగలిగామన్నారు. దీనిపై ఆంధ్రా భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధులు వచ్చేందుకు వీలుగా పథకాలను గుర్తించేందుకు ఒక టీమ్‌ను అధికారులతో ఏర్పాటు చేశామన్నారు. యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు ఇస్తే, 500 కోట్ల రూపాయలు విడుదల అయ్యే అవకాశం ఉందన్నారు. 10 పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు.