ఆంధ్రప్రదేశ్‌

ఉత్సాహంగా జగన్ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, జనవరి 18: మహిళల ఆశ్వీరచనాలు, గ్రామాల్లో కార్యకర్తలు, అభిమానుల ఘన స్వాగతాలు, చిన్న పిల్లల సెల్ఫీలతో జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర గురువారం ఏర్పేడు మండలంలో ఉత్సాహంగా జరిగింది. ఏర్పేడు మండలం వికృతమాల గ్రామ శివారులో బుధవారం రాత్రి జగన్ బస చేశారు. గురువారం ఉదయం అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించిన జగన్ వికృతమాల దళితవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి వెంటరాగా నియోజకవర్గంలోని ప్రజల సాదకబాధలు వివరిస్తుండగా, ఊ కొడుతూ జగన్ పాదయాత్ర సాగించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున గోవిందవరం గ్రామం వద్ద జగన్‌కు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా వారు తమ గోడును జగన్‌కు విన్నవించారు. దీనిపై జగన్ స్పందిస్తూ ‘ నేను సీఎం కాగానే వికలాంగులందరికీ 3వేల రూపాయల పింఛను, 35కేజీల ఉచిత బియ్యం పంపిణీ చేస్తా’ నని భరోసా ఇచ్చారు. తదనంతరం సదాశివపురం, కుక్కలవారికండ్రిగ క్రాస్ రోడ్డు వద్ద మైనార్టీ యువత సభ్యులు పెద్ద ఎత్తున చేరుకుని జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ మేము నీకు అండగా ఉంటాం, ఈసారి నిన్ను సీఎంను చేస్తామంటూ ఆయనను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కుక్కలవారికండ్రిగ గ్రామానికి చేరుకొన్న జగన్ మధ్యాహ్నం 1.30గం టలకు పాదయాత్ర నిలుపుదల చేసి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.