ఆంధ్రప్రదేశ్‌

ఆలస్యమవుతుంటే టెన్షన్‌గా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 19: జిల్లా కలెక్టర్ల సదస్సులో వివిధ అంశాల చర్చకు అనుకున్న సమయం కంటే ఆలస్యం అవుతుండటంతో తనకు టెన్షన్‌గా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చమత్కరించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో విద్యా శాఖపై సమీక్షలో ఆ శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి వివరిస్తూ ఎక్కువ సమయం తీసుకోవడంపై సీఎం స్పందిస్తూ, ఇక మూడు నిమిషాలు దాటగానే బెల్ కొట్టాలేమోనన్నారు. అధికారులకు రొటీన్ అడ్మినిస్ట్రేషన్ అలవాటు అయిందని వ్యాఖ్యానించారు. ఒక నిమిషంలో హైలెట్స్ చెప్పి, కలెక్టర్ల నుంచి ఏమి ఆశిస్తున్నారో చెప్పాలన్నారు. ఇప్పటికే అనుకున్న సమయం కంటే గంటన్నర ఆలస్యమైందని, తనకు టెన్షగా ఉందన్నారు. ఆ తరువాత ఉదయలక్ష్మి తన ప్రసంగాన్ని పెద్ద అంశాలేమీ లేవంటూ ముగించారు.