ఆంధ్రప్రదేశ్‌

వసంత పంచమి రోజున ఏటా ‘అమ్మకు వందనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 19: ప్రతి ఏటా వసంత పంచమి రోజున అమ్మకు వందనం కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో అమ్మకు వందనం బ్రోచర్‌ను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కింద తల్లులను గౌరవించాలని, ఘనంగా దీనిని నిర్వహించాలని కోరారు. ఈ ఏడాది జనవరి 22న నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 136 ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాల నిర్మాణానికి అనువుగా స్థలాలను కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. స్ప్లిట్ రేషన్ కార్డులను ప్రజా సాధికార సర్వేలో కుటుంబం విడిపోయినట్లుగా నమోదు చేశాకే జారీ చేయాలని స్పష్టం చేశారు. అన్ని సంక్షేమ పథకాల అమలకు ప్రజా సాధికార సర్వే డేటాయే ప్రాతిపదికగా తీసుకోవాలని ఆదేశించారు. ట్రక్ షీట్లలో అక్రమాలపై మాట్లాడుతూ ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల నియామకాలు మూడు వారాల్లో పూర్తి చేయాలని తెలిపారు. రేషన్ కార్డులు ఇస్తుంటే, చెడ్డపేరు తీసుకువస్తున్నారన్నారు. ఇందుకు అవసరమైన సర్వీస్ స్టాండర్డ్స్‌ను రూపొందించాలన్నారు. మాతా, శిశు మరణాలు కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉండటంతో దీనిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. ఐటీడీఎలను పర్యవేక్షించేందుకు వీలుగా కలెక్టర్లకు కొన్ని అధికారాలు ఇవ్వాలని ఆదేశించారు. పంచాయితీరాజ్ శాఖ వివిధ శాఖల వివరాలను అనుసంధానం చేసిన తరహాలో సంక్షేమం తదితర శాఖలు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పింఛను, తదితర సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కమిటీలో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములు చేయలన్నారు. దీనిపై మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు కమిటీలో వద్దన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ, అధికారులు తప్పుచేసినా, శిక్ష పడేది ప్రజలకేనని అన్నారు. ఏప్రిల్ నుంచి కొత్తవారికి పింఛన్లు చెల్లిస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి అన్ని మున్సిపాలిటీల్లో ఆనందలహరి కార్యక్రమం ప్రారంభించాలన్నారు.