ఆంధ్రప్రదేశ్‌

నేరగాళ్లకు సింహస్వప్నం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 19: ‘రాష్ట్రంలో ఒక్క రౌడీ కనపడేందుకు వీల్లేదు.. వారికి ఈ రాష్ట్రంలో స్థానం లేదు.. నేరగాళ్లకు సింహస్వప్నం కావాలి.. మీకు సరిగ్గా ఆరునెలల సమయం ఇస్తున్నా. రాష్ట్రంలో నేరాలు తగ్గిపోవాలి.. ముఖ్యంగా మహిళలపై వేధింపులు ఉండకూడదు.. నేరాలు చేసేవారికి భయం ఏర్పడేలా మీ చర్యలుండాలి.. గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపండి.. గిరిజనులను అడ్డుపెట్టుకుని సాగిస్తున్న ఈ అరాచకాలకు తెరదించండి.. గిరిజనులపై కాఠిన్యం వద్దు.. మీకు కావలసిన ఆయుధాలు, వాహనాలు, కొత్త పోలీసుస్టేషన్లకు నిధులు తీసుకోండి.. జాతీయ రహదారుల నిర్మాణాలు, ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించండి.. అని ఐపీఎస్ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ల సదస్సులో భాగంగా సాయంత్రం నుంచి రాత్రి వరకూ జరిగిన ఐపిఎస్ అధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడు శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించి, వాటిపై కొన్ని సూచనలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని, అయితే మరింతగా పటిష్టపరచాల్సి ఉందన్నారు. పోలీసుశాఖలో టెక్నాలజీని విస్తృతంగా ప్రవేశపెట్టామని, ఏపీలో నేరాలు, వైట్ కాలర్ నేరాలు, సైబర్ క్రైం, వేధింపులు పూర్తిగా నియంత్రించాలని, రాష్ట్రంలో తప్పు చేసిన వ్యక్తి ఏ స్ధాయిలో ఉన్నా శిక్షింపబడాల్సిందేనని, నేరం చేసిన వాళ్ళకు ప్రభుత్వం సింహస్వప్నం కావాలని అన్నారు. ఫైబర్ గ్రిడ్ కేబుల్స్ కత్తిరించే మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలను ఆదేశించారు. పీడీ యాక్టు ప్రయోగించాలన్నారు. కిందిస్ధాయి అధికారుల సహకారం ఉందని తెలిస్తే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ప్రైవేటు యాజమాన్యాలైతే ఇలాగే ఊరుకుంటాయా అని ప్రశ్నించారు. ఇదిలావుండగా సంక్రాంతి ఉత్సవాలను జరుపుకోవడంలో తప్పు లేదుగాని ఆ పేరుతో జూదాలు నిర్వహించడం తప్పేనన్నారు. బెల్టుషాపులు ఎక్కడా ఉండటానికి వీల్లేదని, ఆ మాట రాష్ట్రంలో వినిపించకూడదని, వారిపై పీడీ యాక్టు ప్రయోగించాలని ఆదేశించారు. గుట్కా, గంజాయి, ఎర్ర చందనం స్మగ్లింగ్ పూర్తిస్థాయిలో నియంత్రించాలన్నారు. తప్పు చేసిన వాళ్ళకు శిక్షలు పడేలా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రౌడీయిజాన్ని సహించకండని చెబుతూ రౌడీలను రౌడీలు చంపుకోవడం సమర్ధించుకోలేమని, రాజకీయ హత్యలు సమాజానికి మంచిది కాదన్నారు. ఇదిలావుండగా.. ఫోరెన్సిక్‌తో సహా వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సీసీ టీవీలను ఇంటిగ్రేట్ చేయాలని, రిపేర్లు ఉంటే వెంటనే చేయించుకోవాలని సూచించారు. కియా మోటర్స్ వద్ద పోలీస్టేషన్ కావాలని కోరగా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ పోలీస్టేషన్‌కు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారు. కనకదుర్గ గుడి ఫ్లై ఓవర్‌ను ఆరు మాసాల్లో పూర్తి చేయాలని, ఏలూరు విజయవాడ రోడ్డును నెలలో రిపేరు చేయాలని, పుత్తూరు, చిత్తూరు నేషనల్ హైవేను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక విజయవాడ కృష్ణాజిల్లా రోడ్డు సమస్యలు తీర్చాలన్నారు.
ఈనెల 28న సూర్య ఆరాధన
ఈనెల 28న సూర్య ఆరాధన పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఏడాది మాఘ మాసంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.
జలసిరికి హారతి తరహాలో ప్రకృతిని ప్రేమించాలని సూచించారు. సమావేశంలో హోం మంత్రి చినరాజప్ప, డీజీపి మాలకొండయ్య, హోం శాఖ సెక్రటరీ అనూరాధ, ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు, అన్ని జిల్లాల ఎస్పీలు, అదనపు డీజీలు, డిఐజిలు, ఐజిలు పాల్గొన్నారు.

చిత్రం..ఐపీఎస్ అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు