ఆంధ్రప్రదేశ్‌

2019కల్లా సంపూర్ణ అక్షరాస్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 19: 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించేలా చూడాలని జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. పాఠశాలకు వెళ్లే వయస్సున్న ప్రతి చిన్నారి కచ్చితంగా చదువుకునేలా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని, నూతన విద్యా సంవత్సరానికి ఇంకా ఆరు నెలలే సమయం ఉందని చెప్పారు. ఈ విషయంలో నూరు శాతం నమోదయ్యేలా విద్యాశాఖ లక్ష్యం పెట్టుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా మలచాలన్న తన లక్ష్య సాధనకు జిల్లా కలెక్టర్లు తోడ్పడాలని శుక్రవారం జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి సూచించారు. లెర్నింగ్, ఈ లెర్నింగ్ నిరంతర ప్రక్రియగా ఉండాలని చెప్పారు. 60 పాఠశాలలు ఒక గ్రూపుగా ఏర్పాటుచేసి మొత్తం నాలుగు వేల క్లౌడ్ ఆధారిత వర్చువల్ తరగతులను మార్చి 15లోగా ప్రారంభించాలని ఆదేశించారు. వర్చువల్ క్లాస్ రూములు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం విప్లవాత్మకం అని వర్ణించిన ముఖ్యమంత్రి ప్రతి శాఖలో ఐవోటీ సమన్వయకర్తలను నియమించుకుని సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలన్నారు. అన్ని జిల్లాల్లో ఐటీ టవర్లు నిర్మించడంపై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అన్నారు.