ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ ఆదాయం పెంపుపై మరింత దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: భారీ నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఏపీఎస్‌ఆర్టీసీ ఆదాయ వనరుల పెంపుపై అన్ని స్థాయిల్లోని సిబ్బంది, అధికారులు, కార్మికులు మరింతగా దృష్టి సారించాలంటూ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.మాలకొండయ్య పిలుపునిచ్చారు. డీజీపీగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఎండీ హోదాలో ఆయన ఆర్టీసీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూనే ఉన్నారు. తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2018 సంవత్సరానికి సంస్థ స్థితిగతులు, బస్సుల కండిషన్, జిల్లాల్లోనూ, డిపోల్లోనూ అధికారులు, సిబ్బంది అవలంబిస్తున్న విధానాలు, ఇంధన పొదుపు, రోడ్డు ప్రమాదాల గురించి సమీక్షిస్తూ ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రోజువారీ ఆదాయ వనరులు పెంచుకోవాలన్నారు. చివరగా కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ఈ సమావేశంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు ఎ.వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, కార్యదర్శి ఎస్‌ఏ అన్సారీ, 13 జిల్లాల రీజనల్ మేనేజర్లు పాల్గొన్నారు.