ఆంధ్రప్రదేశ్‌

చెప్పులతో కొట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి చంద్రబాబు కరిచాడని, ఆయన చేయని మోసం లేదు,చెప్పని అబద్ధం లేదంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్వరంతో విరుచుకు పడ్డారు. అబద్దాలే చంద్రబాబును గద్దెనెక్కించాయని, ఆయన మాట్లాడేవి అబద్ధాలని తెలియక మోసపోయి ఓట్లు వేసిన రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు దారణంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రజలు తిరగబడితేనే మార్పు వస్తుందని చెప్పిన జగన్ వ్యవస్థను మంటగలిపేందుకు ఎవరు ప్రయత్నించినా తనతో సహా అలాంటి వారికి చెప్పులు, చీపుర్లతో బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆ అబద్ధాలు చెప్పకపోవడం వలన కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో తాము అధికార పీఠాన్ని కోల్పోవలసి వచ్చిందని జగన్ అన్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన జగన్ 87 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తానని, రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, ఆయన మాట విని రైతులు రుణాలు చెల్లించలేదని ఫలితంగా ఇప్పుడు భారీగా అపరాధ రుసుము చెల్లించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే డ్వాక్రా మహిళలు ఎన్నికల ముందు వడ్డీలేని రుణాలను పొందేవారని, బాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించకపోవడం వల్ల వీరికి కూడా చక్రవడ్డీలు కట్టాల్సిన దుస్థితి వచ్చిందని జగన్ చెప్పారు. జాబు కావాలంటే బాబు రావాలని చెప్పిన ఆయన అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు కూడా పోయాయంటూ జగన్ ధ్వజమెత్తారు. జాబు కావాలంటే బాబు రావాలని అన్నారు.
చంద్రబాబు ఓ విలన్
‘14 రీళ్ల సినిమాలో 13 రీళ్లలో విలన్‌దే పైచేయిగా ఉంటుంది.14వ రీల్లో జనం విలన్‌పై తిరగబడతారు. హీరోకు సహకరిస్తారు. విలన్ కథ ముగుస్తుంది’అంటూ చంద్రబాబును పరోక్షంగా జగన్ విమర్శించారు. సిఎం కావడానికి తమను మోసం చేసిన బాబును జనం చూస్తూ ఊరుకోరని అన్నారు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి 20 మంది ఎమ్మెల్యేలను 600 కోట్ల రూపాయలతో సంతలో పశువులను కొన్నట్టు కొన్నారని, ప్రజలు చూస్తున్నారన్న భయం కూడా లేకుండా బరితెగించారని జగన్ విమర్శించారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడన్నారు. ఆడియో, వీడియో రికార్డులతో సహా చంద్రబాబు పట్టుబడితే, ఆయనను జైలుకు పంపించకపోవడం శోచనీయమని జగన్ అన్నారు. చంద్రబాబుకు ప్రజలతో పనిలేదని, అవినీతితో సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు పట్ల ప్రజా వ్యతిరేక పెరుగుతోందని, దీని ముందు ధన బలం ఎంత మాత్రం పనిచేయదని జగన్ తెలిపారు.దీని ముందు డబ్బు పనిచేయదని జగన్ అన్నారు. 2004లో కూడా చంద్రబాబు డబ్బు గుమ్మరించి అధికారంలోకి రావాలనుకున్నారు. కానీ ఆరోజున జనం రాజశేఖరరెడ్డి పక్షాన నిలబడ్డారని గుర్తు చేశారు.
పోలీసులతో కొట్టిస్తారా?
పోలీసు టెర్రరిజం చూస్తే భయమేస్తోంది!
కాపులకు రిజర్వేషన్ కల్పించాలని ముద్రగడ శాంతియుతంగా దీక్ష చేస్తుంటే, పోలీసులు ఆయనపట్ల, ఆయన కుటుంబ సభ్యులపట్ల అమానుషంగా వ్యవహరించి, కొట్టుకుంటూ ఆసుపత్రికి తరలించారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీనే నెరవేర్చమని ముద్రగడ కోరారని, అందుకు పోలీసులతో కొట్టిస్తారా? అని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీస్ టెర్రరిజం చూస్తే భయం వేస్తోందని జగన్ అన్నారు. చంద్రబాబు ఎల్లకాలం అధికారంలో ఉండరని పోలీసుల తలపై ఉన్న మూడు సింహాల వెనుక ఉన్న గుంట నక్క పనిపట్టాలని చంద్రబాబును ఉద్దేశించి జగన్ అన్నారు.

చిత్రం... విజయవాడలో మంగళవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయ సమావేశంలో మాట్లాడుతున్న జగన్