ఆంధ్రప్రదేశ్‌

వినియోగదారుడే రారాజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: ఏ రంగంలోనైనా వినియోగదారుల సంతృప్తే పరమావధిగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏ సంస్థకైనా వినియోగదారుడే రారాజు అని స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తితో విద్యుత్ రంగంలో కె రంగనాథం 50 ఏళ్లుగా అందిస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. ప్రభుత్వ ప్రజానుకూల విధానాలకు తోడు ఇలాంటి వారి సేవలు, అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధి వల్లే లోటు విద్యుత్‌తో సతమతమైన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా అవతరించిందని చెప్పారు. ఇంధనం, పెట్టుబడులు, వౌలిక సదుపాయాల కల్పన శాఖల సలహాదారుగా రంగనాథం విశేష సేవలందిస్తున్నారని, ఆయన సేవలు భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థల తరపున జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించారు. అమరావతిలో ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రంగనాథానికి ఈ అవార్డును అందజేస్తారు. 2002లో రంగనాథం ఏపీ ఎస్‌పీడీసీఎల్ సీఎండీగా ఉన్నప్పుడు లక్ష్యానికి మించి రెవెన్యూ వసూళ్లు సాధించారని, అదే సమయంలో ఆనాడు ఇతర రాష్ట్రాలు భారీ డిమాండ్, వసూళ్ల తేడాతో సతమతమవుతున్నాయని చంద్రబాబు గుర్తుచేశారు. రంగనాథంను సలహాదారుగా నియమింపజేయడంలో ముఖ్యపాత్ర పోషించిన ఇంధన, వౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సీఆర్‌డీఏల ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ అందించిన వివరాల ప్రకారం దేశంలోనే తొలిసారిగా విద్యుత్ రంగంలో తిరుపతిలో స్పాట్ బిల్లింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టడంలో రంగనాథం ఎంతో కృషిచేశారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. తప్పుడు మీటర్ రీడింగ్‌లు, డిమాండ్ నోటీసులకు రశీదులు ఇవ్వకపోవడం వంటి అనేక ఫిర్యాదులు వస్తున్న ఆ సమయంలో తొలిసారిగా స్పాట్ బిల్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. వినియోగదారులు పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ విధానాన్ని తర్వాత రాష్టమ్రంతటా అమలు చేసినట్లు చెప్పారు. ఈసందర్భంగా ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ జి సాయిప్రసాద్, అజయ్ జైన్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్‌కో ఎండీ కె విజయానంద్‌లతో మాట్లాడారు. విద్యుత్ రంగంలోని ఇంజనీర్లందరికీ రంగనాథం స్ఫూర్తిప్రదాత, రోల్ మోడల్ అని అజయ్ జైన్ కొనియాడారు. విశాఖలో హుదూద్ తుపాను విధ్వంసం సృష్టించిన సమయంలో ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీలు దినేష్ పరుచూరి, ఉమాపతి, డిస్కంల సీఎండీలు ఎంఎం నాయక్, హెచ్‌వై దొర, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, ఏపీఎస్‌ఈబీ ఇంజనీర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఈసందర్భంగా రంగనాథంకు అభినందనలు తెలిపారు.