ఆంధ్రప్రదేశ్‌

ఆర్థిక పరిస్థితి అధ్వానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వీలైనంతగా కేంద్రం నుంచి వివిధ పథకాల కింద నిధులను రాబట్టే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రెండంకెల వృద్ధిరేటు సాధించినప్పటికీ ఆమేరకు ఆర్థిక కార్యకలాపాలు పెరగపోవడంతో నిధుల కోసం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. కేంద్రం నుంచి వివిధ పథకాల కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,522 కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉంది. ఇప్పటివరకూ 5468 కోట్ల రూపాయలు విడుదల కాగా, మరో 5054 కోట్లు విడుదల కావాల్సి ఉంది. వీటికి యుటిలైజేషన్ సర్ట్ఫికెట్ ఇస్తే, నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని శాఖల అధికారులు ఈ సర్ట్ఫికెట్లను పంపడంలో జాప్యం చేయటంపై ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయే పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరించారు.
కేంద్రం నుంచి ఉపాధి హామీ, గృహ నిర్మాణ పథకాల కింద ఎక్కువ నిధులు రాష్ట్రానికి వస్తున్నాయి. మరిన్ని కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకుంటే ఎక్కువ నిధులు వస్తాయని భావిస్తున్నారు. కేంద్రం 82 పథకాలను అమలు చేస్తోంది. అందులో 16 పథకాలను ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోంది. 10 పథకాలను ఇప్పటివరకూ ఉపయోగించుకోలేదు. దీంతో ఆ పథకాలను కూడా రాష్ట్రంలో అమలుచేసేలా కసరత్తు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రకటిస్తున్న పథకాల గురించి ఆరా తీసేందుకు, నిధుల విడుదల, కేంద్రంతో సమన్వయం చేసేందుకు ఢిల్లీలోని ఆంధ్రా భవన్ కేంద్రంగా రెండు ఉన్నతాధికారుల బృందాలు పనిచేస్తున్నాయి. ఒక బృందం వివిధ పథకాలను గురించే పనిలో నిమగ్నం కాగా, మరో బృందం రాష్ట్రంలో వాటి అమలు, నిధుల విడుదల వంటి అంశాలను సమన్వయం చేస్తోంది. కాగా నాలుగో త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. జనవరి మాసాంతానికి దాదాపు 7వేల కోట్ల రూపాయలు అవసరవౌతాయని అంచనా వేయగా, ఆదాయం మాత్రం 2వేల కోట్ల రూపాయలకు మించే అవకాశం లేదని ఆర్థిక శాఖ అంచనా.
వడ్డీలు, అప్పుల అసలు, జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు భారీగా నిధులు అవసరం అవుతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందులోభాగంగా వివిధ సంస్థల ద్వారా అప్పులు తెచ్చేందుకు, అందుకు ప్రభుత్వం గ్యారంటీర్‌గా వ్యవహరించేందుకు నిర్ణయించింది. తాజాగా రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ ద్వారా 2వేల కోట్ల రూపాయలను బ్యాంక్‌ల నుంచి రుణం తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది.