ఆంధ్రప్రదేశ్‌

బడ్జెట్ సమావేశాల్లో ‘చలో అమరావతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), జనవరి 21: రాష్టవ్య్రాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తున్న నేపథ్యంలో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బాధితులతో కలిసి ‘చలో అమరావతి’ ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. దీంతోపాటు రాష్టవ్య్రాప్తంగా మండలాల్లో బాధితులకు భరోసా కల్పించేందుకు యాత్రలు, ఆందోళనలు నిర్వహించనున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో బాధితులకు చైతన్యం కలిగించే క్రమంలో సర్వసభ్య సమావేశాలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న బాధితులకు పోస్టుమార్టం రిపోర్టు లేకుండానే నష్టపరిహారం చెల్లించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. విజయవాడలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. అగ్రిగోల్డ్ సంస్థ మూతపడి ముడేళ్లు కాగా, కేసు కోర్టుకెళ్లి రెండేళ్లవుతున్నా బాధితులకు ఇంకా న్యాయం జరగలేదన్నారు. న్యాయస్థానంలో యాజమాన్యం లిటిగేషన్లు సృష్టిస్తూ మార్చి వరకు గడువు ఇస్తే బాధితులకు తామే డబ్బులు చెల్లిస్తామనే ప్రతిపాదన తాజాగా తెరపైకి తీసుకొచ్చిందన్నారు. ఇది కూట్రపూరితంగా ఉందని ముప్పాళ్ల విమర్శించారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న 20లక్షల మంది బాధితులకు తక్షణమే 3965 కోట్ల రూపాయలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చెపట్టాలన్నారు. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు హామీ ప్రకారం డిపాజిట్లు తిరిగి చెల్లిస్తారన్న ఆశ పెరిగిందని, కానీ కేసు జాప్యం అవుతుండటంతో బాధితుల్లో రోజురోజుకీ ఆందోళన పెరుగుతోందని చెప్పారు. కేసు వాయిదా పడిన సందర్భంలో తీర్పు ఎలా వస్తోందోననే ఆందోళనతో బాధితులు రోజూ చచ్చిబతుకుతున్నారని చెప్పారు. బాధితుల్లో మనోధైర్యం పెంచే క్రమంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలోనే మండల స్థాయిలో రెండు లేదా మూడురోజుల పాటు జీపుయాత్రలు నిర్వహిస్తామన్నారు. సత్వరమే బాధితులకు న్యాయం చేసేందుకు మండల కేంద్రాల్లో మూడు రోజుల ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన రానిపక్షంలో బడ్జెట్ సమావేశాల్లో ‘చలో అమరావతి’ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. హైకోర్డు ధర్మాసనం కూడా బాధితుల సమస్యపై సానుకూలంగా స్పందించి సత్వర న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ఆత్మహత్యలకు పాల్పడిన, గుండెపోటుతో మరణించిన వారి కుటుంబాలకు పోలీసు ఎఫ్‌ఐఆర్, పోస్టుమార్టం రిపోర్టుతో సంబంధం లేకుండా 5లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సీఎం చంద్రబాబు కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవండం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అసోసియేషన్ పోరాటం కారణంగానే మార్చి 12న ప్రభుత్వం నష్టపరిహారం చెల్లింపు కోసం జీవో తీసుకొచ్చిందన్నారు. అయితే ఇందులో ఉన్న నిబంధనలు బాధితులకు న్యాయం చేయలేకపోయాయన్నారు. ఈనేపథ్యంలో అసోసియేషన్ చైతన్య యాత్ర నిర్వహించడంతో పాటు విజయవాడలో 30 గంటల నిరాహార దీక్ష చేపట్టడంతో ప్రభుత్వం స్పందించిందన్నారు. నిబంధనలను సరళతరం చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకుని పరిహారం చెల్లింపునకు జీవో ఇవ్వాలంటూ సంబంధిత శాఖను ఆదేశించారని ముప్పాళ్ల వివరించారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ముప్పాళ్ల నాగేశ్వరరావు