ఆంధ్రప్రదేశ్‌

ఫార్మా డీ విద్యార్థులకు న్యాయం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: ఫార్మా డీ విద్యార్థులను ప్రభుత్వపరంగా ఆదుకుని తగిన న్యాయం అందించేలా కృషి చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం విజయవాడలోని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ నివాసంలో ఫార్మా డీ విద్యార్థుల సంఘంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఫార్మా డీ విద్యార్థుల సంఘం నేతలు, విద్యార్థులు, ఎమ్మెల్యేలు ప్రభాకర్‌చౌదరి, జితేందర్ గౌడ్‌లతో మంత్రి పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఫార్మా డీ కోర్సును విద్యార్థులు ఆరు బ్యాచ్‌ల వరకు కోర్సు పూర్తిచేసి బయటకు వెళ్లటం జరిగిందని, వారికి సరైన ఉద్యోగావకాశాలు లేవని వారు తెలియజేశారన్నారు. ఫార్మా డీ విద్యార్థులు ఇప్పటివరకు ఈ కోర్సును రాష్ట్రంలో 59 కాలేజీల ద్వారా 20వేల మంది పూర్తిచేశారన్నారు. దేశవ్యాప్తంగా 220 ఫార్మా డీ కాలేజీలు ఉన్నాయని, 10 సంవత్సరాలుగా ఇవి నడుస్తున్నాయన్నారు. మా వృత్తికి తగిన విధంగా గుర్తింపు లేదని వీరు తెలియజేశారన్నారు. కోర్సుకు సంబంధించి నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా మొదలు పెట్టినట్లు తెలుస్తుందని, వైద్యశాఖకు సంబంధం లేని కోర్సుగా ఫార్మా డీ కోర్సు ఉండటంతో పాటు సాంకేతిక విద్యాశాఖ పరిధిలో ఈ కోర్సుకి అనుమతులు ఇస్తున్నారన్నారు. రెగ్యులర్ ఎంబీబీఎస్ కోర్సులో సీటు రాని విద్యార్థులు ఫార్మా డీ కోర్సుల్లో చేరుతున్నారన్నారు.్ఫర్మా డీ విద్యార్థులు సబ్జెట్ పరంగా చూస్తే ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా చదువుకుంటున్నారన్నారు. వీళ్ల సమస్యలు స్ట్రీమ్ లైన్ చేసేవరకు కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించడం జరిగిందన్నారు. ఫార్మా డీ విద్యార్థుల సమస్య నా దృష్టికి రాగానే దీనిపై చర్యలకు ఉపక్రమించడంతోపాటు విద్యార్థులతో చర్చించి తగిన పరిష్కారం కనుక్కునేందుకు కృషిచేస్తామన్నారు. ఉద్యోగావకాశాలు కల్పనకు, వారికి ఏ విధంగా న్యాయం చేయగలమో పరిశీలించటానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కమిటీలో అకడమిక్ డీఎంఈ (కన్వీనర్), హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీ డ్రగ్స్, కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులతో కమిటీని నియమిస్తున్నామన్నారు. ఈ కమిటీ వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధి విధానాలను పరిశీలించి, విద్యార్థులతో చర్చించి ఒక నివేదిక ఇస్తుందన్నారు. ఈ కమిటీ నివేదిక 45 రోజుల్లో సమర్పించాలని ఆదేశించామన్నారు. ఒకసారి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌తో చర్చిస్తామన్నారు. ఫార్మా డీ విద్యార్థులకు తప్పకుండా తగిన న్యాయం చేస్తామని, అదే విధంగా ఫార్మా డీ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులను వైద్యమిత్ర, జన ఔషధి కిందకు తీసుకునేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామన్నారు.
చిత్రం..మంత్రి కామినేనితో సమావేశమైన ఫార్మా డీ విద్యార్థులు