ఆంధ్రప్రదేశ్‌

ఏడాదిలో అధికారుల గృహ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: రాజధాని పరిపాలనా భవనాల పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ 11న కేత్రస్థాయిలో నేలపాడు, రాయపూడి ప్రాంతాల్లో పర్యటన చేసిన నాటి నుండి ఈరోజు పనుల పురోగతిని ప్రత్యక్షంగా చూడవచ్చని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. మంగళవారం అమరావతి రాజధాని ప్రాంతంలోని నేలపాడు, రాయపూడి, అనంతవరం గ్రామాల్లో విలేఖరులతో కలిసి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి ఇంజనీర్లకు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలన చేపట్టారు. ప్రభుత్వం రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి అమరావతి రాజధాని ప్రాంతం 217 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో తొమ్మిది నగరాలను రూపుదిద్దుతున్నామని అందులో అత్యంత నాణ్యతతో కూడిన పరిపాలనా భవనాలను షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మించేందుకు పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. నేలపాడులో నిర్మితమవుతున్న ఏపీసీఆర్‌డీఏ, ఎన్‌జీవోల ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై ఎల్ అండ్ టీ అధికారులతో మంత్రి సమీక్షించారు. అంతకుముందు పీఎంఆర్‌వై, ఎన్‌టీఆర్ నగర్‌లో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి పురోగతిపై నిర్మాణాల పనితీరుపై కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకుని తగిన సూచనలు చేశారు. పర్యటనలో భాగంగా విలేఖరులతో మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో 1450 ఎకరాల్లో పరిపాలనా నగరం నిర్మిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు, గెజిటెడ్, ఎన్‌జీవోలు, నాల్గవ తరగతి ఉద్యోగులకు సంబంధించి 3,840 భవన సముదాయాలతో కూడిన 61 టవర్లను నిర్మిస్తున్నామన్నారు. ఏడాదిలోగా గెజిటెడ్, ఎన్‌జీవోల భవనాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. 15 నెలల్లో పూర్తిస్థాయిలో పరిపాలనా భవనాలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
కేసుల మాఫీ కోసమే బీజేపీతో కలుస్తానంటున్న జగన్
కేసుల మాఫీ కోసమే బీజేపీతో కలుస్తానని ప్రతిపక్ష నేత జగన్ అంటున్నారని మంత్రి నారాయణ ఆరోపించారు. జగన్‌కు కేసులే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలేవీ అవసరం లేదని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై జగన్‌కు చిత్తశుద్ధి లేదని, ఆయన శ్రద్ధంతా కేసులపైనే అని ఎద్దేవా చేశారు.