ఆంధ్రప్రదేశ్‌

హెచ్‌పిఎఫ్‌ఎస్ లేని మద్యం దుకాణాలకు సరుకు సరఫరా నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: రాష్ట్రంలో కల్తీ, ఇరుగు పొరుగు రాష్ట్రాల మద్యం అమ్మకాల నియంత్రణకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ గట్టి చర్యలు చేపట్టింది. మద్యం తయారీ నుంచి పంపిణీ, నిలువ, విక్రయం వరకు ఎక్సైజ్ శాఖ కనుసన్నల్లో నడిచేలా అన్ని మద్యం దుకాణాల్లో ‘హెడానిక్ పాత్ ఫైండర్ సిస్టిం’ (హెచ్‌పిఎఫ్‌ఎస్)ను విధిగా ప్రతి మద్యం దుకాణంలో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. సుమారు రూ. 90వేల విలువైన ఈ సిస్టం కంప్యూటర్‌కు అనుసంధానమై ఉంటుంది. ఈ విధానం ద్వారానే సమీప మద్యం డిపోలకు అర్డర్‌లు ఇచ్చుకోవాల్సి ఉంది. అప్పుడే మద్యం నిలువ డెలివరీ జరుగుతుంది. వైన్ షాపుల్లో అయితే ఈ విధానం ద్వారానే ఎంఆర్‌పి, సంబంధిత బ్యాచ్ నెంబర్ వచ్చే బిల్లును కస్టమర్లకు అందించాల్సి ఉంది. ఏడాది క్రితమే ఈ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ యజమానులు ఎప్పటికప్పుడు వాయిదా అడుగుతూ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,300 వైన్‌షాపులు, 700 బార్ అండ్ రెస్టారెంట్‌లు ఉన్నాయి. సాలీనా రూ. 20వేల కోట్ల అమ్మకాలు జరుగుతాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం 3,500 వైన్‌షాపులు మాత్రమే వీటిని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ నెల 20వ తేదీ నాటికి విధిగా ప్రతి దుకాణదారుడు ఈ సిస్టంను అమర్చుకోవాల్సి ఉంది. బార్ అండ్ రెస్టారెంట్లకు అయితే నెలాఖరు వరకు గడువు ఇచ్చారు. దీంతో ఈ విధానాన్ని అమర్చుకోని దుకాణదారులకు రాష్ట్రం వ్యాప్తంగా వివిధ డిపోల్లో ఈ నెల 21వ తేదీ నుంచి సరుకు సరఫరా నిలిపివేస్తూ మంగళవారం పలుచోట్ల ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. సరుకు డెలివరీ నిలిచిపోవటంతో బార్ యజమానులు ఉరుకులు పరుగులు తీస్తూ ఎక్సైజ్ మంత్రి జవహర్‌ను కలిసినట్లు తెలిసింది. ఆయన జోక్యం చేసుకుని వీరికి నెలాఖరు వరకు గడువు పొడిగింపచేసినట్లు తెలిసింది.