ఆంధ్రప్రదేశ్‌

పోలీసుల సొంతింటి కల నిజం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 23: పోలీసుశాఖలోని ప్రతి పోలీసుకు సొంత ఇంటి కల నిజం చేయాలన్నదే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్‌మీరా అన్నారు. రాష్ట్రంలోని పోలీసులందరికీ క్వార్టర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్థలం ఇస్తే కొంత లోనుతో పోలీసు సొంత ఇంటి కల నిజం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడలో పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ బోర్డు మీటింగ్ మంగళవారం జరిగింది. డీజీపీతోపాటు హోం సెక్రటరీ అనూరాధ ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరుకాగా.. పలు అంశాలపై చర్చించారు. అనంతరం చైర్మన్ మీరా విలేఖరులతో మాట్లాడుతూ పోలీసుశాఖ భవన సముదాయాల్లో రాష్ట్రం నెంబర్‌వన్ స్ధానంలో ఉందన్నారు. రాష్ట్రంలో సిఐడి కార్యాలయాలు, ఏసిబి, ఎస్పీల బంగ్లాలతోపాటు 22 కోట్లతో అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు సంబంధించి నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఇదిలావుండగా సమావేశానికి హాజరైన డీజీపీ ఎం మాలకొండయ్య అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఆయేషామీరా హత్య కేసు ప్రస్తావించగా కేసు పునర్విచారణపై హైకోర్టు ఆదేశాలు తమకు అందాయని, హైకోర్టు పర్యవేక్షణలో ఆయేషా కేసును సిట్ పునర్విచారణ చేస్తోందని చెప్పారు. కోడి పందాల నిర్వహణపై కోర్టు అడిగిన నివేదక సమర్పించనున్నట్లు తెలిపారు. కోడి పందాల నివారణకు పోలీసుపరంగా తీసుకున్న చర్యలను వివరిస్తామని చెప్పారు. పోలీసుల సొంతింటి ఇంటి కల నెరవేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.