ఆంధ్రప్రదేశ్‌

కాపులకు బీసీ (ఎఫ్) సర్ట్ఫికెట్ ఇస్తేనే అసలైన రిజర్వేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, జనవరి 23: రాష్ట్రంలోని అన్ని మండలాల్లో కాపులకు బీసీ (ఎఫ్) సర్ట్ఫికెట్ మంజూరు చేసినప్పుడే అసలైన రిజర్వేషన్ వర్తింప చేసినట్లవుతుందని కాపునాడు కన్వీనర్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపుల రిజర్వేషన్ బిల్లుకు ఇప్పటికే శాసనసభ, శాసనమండలి ఆమోదంతో పాటు గవర్నర్ సంతకం కూడా చేశారన్నారు. ప్రభుత్వం తొలివిడతగా 700 పోస్టులు, రెండోవిడత మరో 700 పోస్టులను విడుదల చేయటమేకాక త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించనుందని, పోలీసు శాఖలో కూడా వేలాది ఉద్యోగాలు ఉన్నాయని, ఉద్యోగావకాశాలు అన్నీ పూర్తయ్యాక కాపులకు రిజర్వేషన్ ఇచ్చి ఏం ఉపయోగమని ప్రశ్నించారు. కాపు జాతికి అన్యాయం చేయవద్దని, ఆకలి తీర్చమని అడుగుతున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ ప్రకటించి కాపు యువతను శాంతింప చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన సీఎం నాలుగేళ్లయినప్పటికీ ప్రకటించలేదని, దీనివల్ల తమ జాతి ఉపాధి అవకాశాలను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులకు రిజర్వేషన్ వస్తుందనే నమ్మకం తమ జాతికి ఉందన్నారు. బీసీ కులాలకు ఎలాంటి రిజర్వేషన్ వర్తింప చేస్తున్నారో అలాగే తమకు కూడా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.