ఆంధ్రప్రదేశ్‌

దుర్గగుడి ఈవోగా పద్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: విజయవాడ దుర్గ గుడి ఈవోగా డాక్టర్ ఎం.పద్మను ప్రభుత్వం నియమించింది. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరిస్తున్న ఆమెను పూర్తి స్థాయి ఈవోగా మంగళవారం నియమించింది. దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారంలో అప్పటి ఈవో సూర్యకుమారిపై బదిలీ వేటు వేసి సాధారణ పరిపాలనా విభాగానికి బదిలీ చేసి, ఇన్‌చార్జి ఈవోగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనూరాధను ఇటీవల నియమించింది. అమె స్థానంలో పద్మను పూర్తిస్థాయిలో ఈఓగా నియమించారు. తదుపరి నియామకం జరిగేంత వరకూ ఆమె బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. కార్మిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్‌ను రహదారులు, భవనాల శాఖకు బదిలీ చేసింది. ఆయన కార్మిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా కొనసాగుతారు. జీఏడీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న గోపాల్ కృష్ణ ద్వివేదీని అదే హోదాలో పశుసంవర్ధక శాఖకు బదిలీ చేసింది. పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న జెఎస్‌వి ప్రసాద్‌ను జిఏడీకి బదిలీ చేశారు.