ఆంధ్రప్రదేశ్‌

లోకేష్‌కు బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), జనవరి 23: ఏపీ మంత్రి నారా లోకేష్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. పలు సంస్థలతో భేటీ అవుతూ పారిశ్రామికవేత్తలను ఏపీకి ఆహ్వానిస్తూ బీజీగా ఉన్నారు. మంగళవారం మంత్రి లోకేష్ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు తన కుమారుడు, మంత్రి లోకేష్‌కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు యువతకు ప్రతినిధి, చరిష్మాగల నాయకుడు లోకేష్ అని ప్రశంసించారు. ఏపీ రాష్ట్ర ప్రజలకు సేవలందించే దిశలో అంకిత భావంతో పని చేసేవిధంగా మరింత శక్తిమంతుడు కావాలని ఆకాంక్షించారు.
షారుఖ్‌కు అభినందనలు
బాలీవుడ్ స్టార్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. షారుఖ్ ఖాన్ తాజాగా దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రత్యేక అవార్డును స్వీకరించడం, ఆయనను సత్కరించడంపై చంద్రబాబు ట్వీటర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. బాలలు, మహిళల హక్కుల కోసం ఆయన చేస్తున్న సేవలకు షారుఖ్‌ను క్రిస్టల్ అవార్డుతో గౌరవించడం అభినందనీయమన్నారు.