ఆంధ్రప్రదేశ్‌

సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 23: విభజన నేపథ్యంలో రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. హైకోర్టు సాధన కోసం సీమ జిల్లాల్లో న్యాయవాదులు ఉద్యమిస్తున్నారు. తమ ఆందోళనలను ఉధృతం చేయడంలో భాగంగా మంగళవారం నుంచి ఈనెల 25 వరకు మూడు రోజుల పాటు కోర్టు విధుల్ని బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో విధుల బహిష్కరణ, ర్యాలీలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి బార్ అసోసియేషన్ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. అనంతపురంలో న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. ఈనెల 27న కడపలో సీమ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు సమావేశం కానున్నారు. సీమ ప్రజల ఆకాంక్ష అయిన హైకోర్టు ఆశయ సాధనకు జాయింట్ యాక్షన్ కమిటీనీ ఏర్పాటు చేయనున్నట్లు అనంతపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్‌భూషణ్‌రెడ్డి తెలిపారు. కాగా ఉమ్మడి మదరాసు రాష్ట్రం నుంచి విడిపోయిన అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో గుంటూరులో హైకోర్టు ఏర్పాటైంది. అనంతరం ఆంధ్ర రాష్ట్రం, అప్పటి తెలంగాణ ప్రాంతాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిన నేపథ్యంలో హైదరాబాద్‌కు హైకోర్టు తరలిపోయింది. తర్వాత ఎన్‌టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా 1994లో సీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో రెండు నెలల పాటు ఆందోళనలు జరిగాయి. అప్పట్లో తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేసి జేఏసీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాదు నుంచి హైకోర్టును తరలించే ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో సీమలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉద్యమాలు మొదలయ్యాయి. సీమలోని ఎమ్మెల్యేలు, ఎంపీలపై మరింత ఒత్తిడి పెంచేందుకు జేఏసీ అనంతరం ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి సిద్ధమవుతున్నారు.

చిత్రం..విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహిస్తున్న న్యాయవాదులు