ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యే కలమటకు వారంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 23: జిల్లాలోని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు కొత్తూరు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ మంగళవారం నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)ని జారీ చేసారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను తగలబెట్టినందుకు నమోదైన కేసులో కోర్టుకు హాజరుకాని ఎమ్మెల్యే కలమటకు ఈ నాన్-బెయిల్‌బుల్ వారెంట్ జారీ అయ్యింది. 2015, జూన్ 9న అలికాం - బత్తిలి సమీపంలోని హిరమండలం ప్రధాన రహదారిపై ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసి కలమట వెంకటరమణ నిరసన వ్యక్తం చేసారు. ఈ సంఘటనపై అప్పటి హిరమండలం ఎస్సై వి.శ్రీనివాస్ ఎమ్మెల్యే వెంకటరమణ, మరో 13 మందిపై ఐపీసీ సెక్షన్ 341, 143, 283, 285 కింద కేసులు నమోదు చేసారు. ఆ కేసుకు సంబంధించి సోమవారం కలమట వెంకటరమణ కొత్తూరు జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుకావల్సివుండగా, రాకపోవడంతో ఆయనపై ఎన్బీడబ్ల్యూను న్యాయమూర్తి బి.కిరణ్‌కుమార్ జారీ చేసారు. ఎమ్మెల్యే కలమటతోపాటు సలాన మోహనరావు(మెళియాపుట్టి), పాలక రవి (కొత్తూరు), శివ్వాల కిషోర్‌బాబు (ఎల్‌ఎన్‌పేట) సోమవారం కోర్టుకు గైర్హాజరు కావడంతో వీరిపై కూడా ఎన్బీడబ్ల్యూ జారీ అయింది. ఇదిలా ఉండగా, 2015లో పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వైసీపీ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షంగా చేసే పలు ఆందోళన, నిరసనలో భాగంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తర్వాత 2016, మార్చి 4న టీడీపీలో చేరిన కలమట మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో చాలా సన్నిహితంగా ఉంటూ ప్రస్తుతం టీడీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ సమయంలో ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ కావడం విశేషం.