ఆంధ్రప్రదేశ్‌

స్టే ఉండగా ఎలా తొలగిస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, జూన్ 16: రహదారుల విస్తరణ కోసం రాజధాని ముఖద్వారమైన ఉండవల్లిలోని సుమారు 20 ఇళ్ళు తొలగించే విషయంలో అధికారులకు, స్థానికులకు మధ్య వివాదం నెలకొంది. గత రెండు వారాలుగా రహదారుల వెడల్పుకు రోడ్డు పక్కనే ఉన్న నివాసాలకు అధికారులు మార్కింగ్ చేశారు. కొద్ది రోజుల క్రితం వరకూ రెవెన్యూ, ఆర్ అండ్ బి, అధికారులు, ప్రత్యేక సర్వేయర్ల బృందం ఉండవల్లిలోని ప్రధాన రహదారి వెంట సర్వేలు నిర్వహించడాన్ని ప్రశ్నించగా గ్రామకంఠాలు తేల్చేవిషయమని చెప్పిన విషయం విదితమే. అధికారుల చర్యలను సవాలు చేస్తూ బాధితులు కోర్టును ఆశ్రయించి, కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ని ఫ్లెక్సీల రూపంలో తమ ఇళ్ల ముందు బాధితులు ఏర్పాటు చేశారు. గురువారం బాధితులు గుంటూరుజిల్లా జాయింట్ కలెక్టర్‌ని సంప్రదించి తమ ఆవేదన విన్నవించుకోగా, ఇళ్ళు తొలగించి తీరాల్సిందేనని జెసి స్పష్టం చేసినట్లు బాధితులు చెప్పారు. ఇవేకాకుండా రకరకాల సర్వేలు అధికారులు నిర్వహించి తమను మానసికంగా ఒత్తిడికి గురిచేశారని బాధితులు చెపుతున్నారు. తొలగించటానికి సిద్ధపడిన ఇళ్ళలో ఎక్కువ భాగం గ్రామకంఠంలోనూ, పట్టా భూములుగా ఉన్నాయని, అధికారులు ముందుగా గృహ యజమానులను సంప్రదించకుండా నేరుగా జెసిబిలతో ఇళ్ళపైకి రావటమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం ఇళ్లకు కట్టిన కోర్టు స్టే ఫ్లెక్సీ