అంతర్జాతీయం

ఆనందంగా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఫిబ్రవరి 11: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మొట్టమొదటి హిందూ ఆలయ నిర్మాణ ప్రాజెక్టుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. దుబాయ్ ఒపెరా హౌస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వామినారాయణ ఆలయానికి మోదీ శంకుస్థాపన చేస్తూ, మానవత్వం, సామరస్యం, భారతీయతకు ఈ పవిత్ర ప్రాంతం తలమానికంగా నిలువగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ నమూనాను ఆవిష్కరించారు. 55వేల చదరపు మీటర్ల స్థలంలో బోచసాన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆలయ నిర్మాణ ప్రాజెక్టుకు అనుమతించిన దుబాయ్ యువరాజుకు 125 కోట్ల భారతీయుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
అబుదాబి యువరాజు మహ్మద్ బిన్ జాయెద్ స్వయంగా ఆలయ నిర్మాణం పట్ల ఆసక్తి కనబర్చడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ప్రవాస భారతీయుల హర్షధ్వానాల మధ్య వెల్లడించారు. భారత్-యూఏఈల మధ్య ఉన్న సంబంధాలు కేవలం వ్యాపార వాణిజ్యాలకే పరిమితమైనవి కావని, అనేక రంగాల్లో ఇవి ఎంతగానో విస్తరించాయన్నారు. అంతర్జాతీయ స్థాయికి భారత్‌ను తీసుకెళ్లాలన్న లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఒక్క గల్ఫ్ దేశాలతోనే కాకుండా ప్రపంచ దేశాలు అన్నింటితోనూ ఈ రకమైన సంబంధాలనే భారత్ కోరుకుంటోందన్నారు.

chitram...
ఒపెరా హౌస్‌లో భారత సంతతి ప్రజలకు శిరసువంచి
అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.
ఇన్‌సెట్‌లో యూఏఈలో నిర్మించనున్న స్వామి నారాయణ ఆలయ నమూనా