ఆంధ్రప్రదేశ్‌

కోటప్పకొండ తిరునాళ్ళకు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, ఫిబ్రవరి 12: శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరుని తిరునాళ్ళకు అన్ని శాఖల అధికారులు సర్వం సిద్ధం చేశారు. బందోబస్తు నిమిత్తం వేలాది మంది పోలీసులు సోమవారం నాటికే కొండకు చేరుకున్నారు. బారికేడ్లు, విద్యుత్, మంచినీరు, స్వామివారిని దర్శించుకునేందుకు ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం, ప్రత్యేక దర్శనాన్ని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి భైరాగి ఏర్పాటు చేశారు. మంగళవారం తెల్లవారుజామునే స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం అలంకరణ చేసి, భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆలయ మూలవిరాట్ వెనుక ఉన్న రెండు అభిషేక మండపాల్లో 300 రూపాయల టిక్కెట్‌తో భక్తులు అభిషేక కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేశారు.