ఆంధ్రప్రదేశ్‌

సీఎం, సీఎస్ ఆదేశాలు బేఖాతర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 12: ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాలనకు రెండు కళ్లు. వారిచ్చే ఆదేశాలు అక్షరాలా పాటించాల్సిందే. అలాంటి శిలాశాసనాన్ని స్వయంగా ప్రభుత్వ శాఖలే ధిక్కరించి, ఆ ఇద్దరి ప్రయత్నాన్ని వెక్కిరించి అవమాన పరుస్తున్న దుస్థితి ఇది. బడ్జెట్ కొరత, సిబ్బంది లేమి ఉన్నప్పటికీ అధికారులు-ఉద్యోగుల సమన్వయంతో దానిని కష్టంగా అధిగమిస్తున్న రాష్ట్ర సమాచార శాఖను గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ శాఖలు తమ ప్రకటనలను సమాచార శాఖ ద్వారానే ఇవ్వాలని ఓ ఉత్తర్వు వెలువరించారు. దానివల్ల ఆ శాఖకు బడ్జెట్ పెంచే బదులు, ఇలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు వల్ల సమస్య పరిష్కారమవుతుందని వారిద్దరూ భావించారు. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మారినా ఇప్పటివరకూ ఆ ఉత్తర్వు అమలుకు నోచుకోని ఫలితంగా అవమానం పాలయిన, ధిక్కార పరిస్థితి నెలకొంది. ప్రభుత్వంలోని ఇద్దరు ముఖ్య వ్యక్తులు ఇచ్చిన ఉత్తర్వును అమలు చేయించి, శాఖల మధ్య సమన్వయం చేయాల్సిన ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ అవమాన పర్వంలో భాగస్వామి అయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖలు ప్రింట్, ఎలక్ట్రానిక్, హోర్డింగుల ద్వారా చేసే ప్రచారాన్ని ఇకపై సమాచార శాఖ ద్వారానే ఇవ్వాలని గతంలో ఠక్కర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు.. లెటర్ నెం.005724/ఏడీవీటీ/2016, డేటెడ్ 17-7-2017తో 14-9-2017న ఉత్తర్వు వెలువడింది. దాని ప్రకారంగా అన్ని ప్రభుత్వ శాఖలు తమ ప్రకటనలు సమాచారశాఖ ద్వారా విడుదల చేయాల్సి ఉంటుంది. అంటే ఆ నిధులను సమాచారశాఖకు ఇస్తే, ఆ శాఖ మీడియా, ఏజెన్సీలకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇది విడుదలయి ఇన్నాళ్లయినా దాని అమలుకు అతీ గతీ లేకుండా పోయింది. సీఎం ప్రత్యేక చొరవ తీసుకుని, సీఎస్‌తో చర్చించి మరీ ఇచ్చిన ఈ జీఓను అమలు చేసేందుకు ఏ ప్రభుత్వ శాఖ కూడా ఇష్టపడటం లేదు. ఈ జీఓ విడుదల చేసిన తర్వాత ఇంతవరకూ ఒక్క ప్రకటన కూడా సమాచార శాఖ ద్వారా విడుదల కాలేదంటే, సీఎం చొరవతో సీఎస్ ద్వారావిడుదలైన ఈ జీఓకు ఏ స్థాయిలో అవమానం జరుగుతోందో స్పష్టమవుతోంది. ఆయా శాఖల మంత్రులు, కమిషనర్లు ఎవరికి నచ్చిన వారి ఏజెన్సీలకు ప్రకటనలు ఇస్తున్నారు. దీనివెనుక చాలా మతలబు జరుగుతోందన్న ఆరోపణలూ లేకపోలేదు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక జీఓను అమలు చేయించాల్సిన సీఎంఓ అధికారులు, అసలు సమాచార శాఖ అంటేనే లెక్కలేనట్లు, అదో అప్రాధాన్యమైన శాఖగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా పరిశ్రమల శాఖ కార్యదర్శి పేరుతో, సమాచారశాఖ ఏజెన్సీ రేట్ల కంటే తక్కువగా ఉన్నాయన్న సాకుతో విడుదలయిన ఓ సర్క్యులర్ చూస్తే, ప్రభుత్వంలో సీఎం, సీఎస్‌లకు ఏ పాటి విలువ ఉందో స్పష్టమవుతుంది. మెమో నెం.11782/పిఅండ్‌ఐ/ఏ1/2018 డెటేడ్ 20-1-2018 పేరుతో విడుదలయిన ఉత్తర్వులో విశాఖలో జరిగే పార్టనర్‌షిప్ సమ్మిట్ ప్రకటనలన్నీ, పరిశ్రమశాఖల ద్వారానే ఇవ్వాలని, సమాచార శాఖ కమిషనర్‌ను ప్రకటనలు ఇవ్వవద్దని స్పష్టంగా పేర్కొన్నారు. ఇది ఒక రకంగా ప్రభుత్వానికే అవమానంగా భావిస్తున్నారు. దీనితో సీఎస్ ఇచ్చిన జీఓకు విలువలేకుండా పోయినట్టయింది. కాగా, సమాచార శాఖకు 146 కోట్ల బడ్జెట్ కేటాయించారు. దీనిలో ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులకు 70 కోట్లు పోగా మిగిలిన వాటితోనే ప్రచారానికి ఖర్చు పెడుతున్నారు.పెండింగ్ బిల్లులు, సిబ్బంది కొరతతో సతమతమతవుతున్న సమాచారశాఖపై రాజకీయ నేతల ఒత్తిళ్లు అధికమవుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ అనుచరులకు ప్రకటనలు, హోర్డింగులు ఇవ్వాలని రోజూ ఒత్తిడి చేస్తుంటారు. అవన్నీ ఆ శాఖ ద్వారానే ఇస్తారన్న భావనే దానికి కారణం. అయితే అసలు విషయం ఎవరికీ తెలియకపోవడం, ఇచ్చిన జీఓనే అమలుచేయటం లేదన్న విషయాన్ని సీఎంకు చెప్పేవారు లేకపోవడంతో.. ఆయా వర్గాలన్నీ సమాచార శాఖ అధికారులు, తాము చెప్పిన పనులు చేయడం లేదని పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. బడ్జెట్ లేనిదే తామేమి చేయలేమని, సెంట్రలైజ్డ్ జీఓను అమలుచేయాల్సింది ప్రభుత్వమే కాబట్టి ఈ విషయంలో తాము నిస్సహాయులమని ఉన్నతాధికారులు చేతులెత్తేస్తున్నారు. నిజానికి సమాచార శాఖ అధికారుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.
ఈ శాఖలో పెత్తనం చేసే వారి సంఖ్య ఎక్కువ, బాధ్యత తీసుకునే వారి సంఖ్య తక్కువగా ఉంది. సమాంతర వ్యవస్థల వల్ల ఎవరు ఏ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నది గందరగోళంగా మారింది. సోషల్ మీడియా ఒకరు, క్రియేటివ్ ఆర్టు వర్కు, డిజిటల్ మీడియా, టీవీ అడ్వర్టయిజ్‌మెంట్లు, ఎయిర్‌పోర్టులో డిస్‌ప్లే, సమావేశ హాలులో ఏర్పాట్లు, వెబ్‌సైట్ ఆన్‌లైన్ యాడ్స్ పనులన్నీ ప్రైవేటుపరమవగా, సమాచార నిమిత్తమాత్రురాలిగా మిగిలింది. కానీ ఏ వార్త రాకపోయినా మంత్రులు, ముఖ్యులు తమనే బాధ్యులను చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. పెత్తనం ఒకరు, బాధ్యులు మరొకరుగా మారిన పరిస్థితి నెలకొందంటున్నారు. కానీ అది తమ పరిధిలో లేదన్న విషయం వారికి తెలియడం లేదని, సమాచార శాఖ మీదే కాబట్టి మీకు తెలియకుండా ఎలా ఉంటుందన్న ప్రశ్నలకు, ఏవిధంగా జవాబు చెప్పాలో తెలియడం లేదని ఉన్నతాధికారులు వాపోతున్నారు.