ఆంధ్రప్రదేశ్‌

ప్రజలకే మేం జవాబుదారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 12: రాష్ట్ర విభజన చట్టంలోని ప్రతి ఒక్క అంశాన్ని కూడా దశలవారీగా తుచ తప్పక కార్యాచరణలోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో టీడీపీకి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మిత్రధర్మాన్ని విస్మరించి ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్గ సమావేశాల్లో నేడు టీడీపీ ఎంపీల దగ్గర నుంచి దిగువ స్థాయి నేతల వరకు వాడుతున్న ముష్టి.. భిక్ష వంటి పరుష పదజాలాలకు తక్షణం స్వస్తి పలకాలన్నారు. లేదంటే తామందరం కలిసి ప్రజల ఎదుటికే వచ్చి గతంలో ఏమి జరిగింది.. ప్రస్తుతం ఏమి జరుగుతున్నది.. మున్ముందు ఏమి జరుగబోతున్నదీ.. తగు ఆధారాలతో చెప్పగలమన్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు 27 పేజీలతో ఇచ్చిన ప్రకటనలో కనీసం ఏ ఒక్కటైనా అవాస్తవమని ఆధారాలతో చూపించిన పక్షంలో తాను శిక్షార్హుడినని కంభంపాటి స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. దీన్ని ఓ సవాల్‌గా తీసుకోవాలిగానీ ప్రతి ఒక్కరూ అభ్యంతరకరమైన పదజాలాన్ని వాడటం ఏమిటంటూ ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు అభ్యంతరం లేదంటూ చంద్రబాబు 2008 డిసెంబర్ 18న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా లేఖ రాయలేదా అంటూ నాటి లేఖ ప్రతులను ప్రదర్శించారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం విభజన చట్టంలో అనేకానేక అంశాలను బీజేపీ పొందుపర్చగల్గిందన్నారు. అలాగే వాటి అమలుకు ఏ పదవిలో ఉన్నప్పటికీ నిరంతరం కృషి చేస్తున్నది వెంకయ్యనాయుడు కాదాఅని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారాన్ని ప్రజల వద్దకు వెళ్లి వారికే నేరుగా చెబుతామన్నారు. తాము ప్రజలకే జవాబుదారీగా ఉంటామని, రాజకీయ పార్టీలకు కాదన్నారు.