తెలంగాణ

పక్కాగా.. నీటిలెక్క!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటాపై గట్టిగా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో గురువారం కేంద్ర జల వనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగే సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై జలసౌధలో బుధవారం నీటిపారుదల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని మంత్రి హరీశ్‌రావు నిర్వహించారు.
రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసే ప్రతిపాదనలను ఏవిధంగా తిప్పికొట్టాలన్న అంశంపై కూడా మంత్రి చర్చించారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల జరిగే ముంపు సమస్యలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల చారిత్రక భద్రాచలం ఆలయంతో పాటు పలు గ్రామాలు, బొగ్గు గనులు, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ తదితర ముఖ్యమైన ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని మంత్రి హరీశ్‌రావు వివరించారు. భద్రాచలం పట్టణం దాని చుట్టుపక్కల గోదావరి పరీవాహక ప్రాంతంలో 124 కిలో మీటర్ల మేరకు పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఉంటుందని, అలాగే బ్యాక్ వాటర్ వల్ల తలెత్తే సమస్యలపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. బచావత్ ట్రిబ్యూనల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతి ఇస్తూ నాగార్జునసాగర్‌కు ఎగువనున్న రాష్ట్రాలకు 45 టిఎంసిల నీటిని వినియోగించుకునే హక్కు ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే చేపట్టడంతో 45 టిఎంసిల నీటిని తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల కింద 36.45 లక్షల హెక్టార్ల సాగుకు యోగ్యమైన ఆయకట్టు ఉన్నప్పటికీ కేవలం 5.75 (శాతం) లక్ష హెక్టార్లకు మాత్రమే సాగునీరు అందుతుందన్నారు. అనుమతి లేకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి గోదావరి జలాలు వాడుకోవడంపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. పట్టిసీమ ప్రాజెక్టులోనూ తెలంగాణకు 45 టిఎంసిల వాటా ఉంటుందన్నారు. మొత్తంగా రెండు కృష్ణాలో 811 టిఎంసీలు కేటాయించగా అందులో తెలంగాణకు 575 టిఎంసీలు కేటాయించడం వల్లనే న్యాయం జరుగుతుందని కేంద్రాన్ని గట్టిగా కోరాలని అధికారులకు మంత్రి మార్గదర్శకం చేసారు. రాజోలి బండా డైవర్షన్ స్కీమ్ కింద రాష్ట్రానికి 15.9 టిఎంసీల కేటాయింపు ఉన్నప్పటికీ కేవలం 4.56 టిఎంసీలు మాత్రమే వస్తున్నాయన్నారు. అలాగే ఆర్డీఎస్ కాలువల ఆధునీకరణ పనులు చేపట్టాలని 2004లో నిపుణుల కమిటీ సిఫారసు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సాగునీటి ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుపడుతున్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద నీటి వాడకాన్ని లెక్క కట్టేందుకు టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కేంద్ర జలవనరులశాఖ ఆదేశించినప్పటికీ కృష్ణానదీ యాజమాన్య మండలి అమలు చేయడం లేదని కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. తొలి విడతలో 19 టెలిమీట్రీ స్టేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ అవీ పని చేయడం లేదన్నారు. అలాగే రెండో విడతలో ఏర్పాటు చేయాల్సిన టెలిమెట్రీ స్టేషన్ల జాబితాను ఇంతవరకు ఖరారు చేయకపోవడం తీవ్ర అభ్యంతరకరమని మంత్రి అన్నారు. టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల పొతిరెడ్డిపాడు నుంచి అధిక నీటిని కృష్ణా బేసిన్‌కు అవతలకు అక్రమంగా తరలించడంపై కూడా కేంద్రానికి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు.

chitram....
సీడబ్ల్యూసీ భేటీ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులతో
సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు