ఆంధ్రప్రదేశ్‌

నేను ఎవరికీ భయపడను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 15: కేంద్రానికి తాను భయపడుతున్నానన్న విమర్శలను ముఖ్యమంత్రి చంద్రబాబు కొట్టివేశారు. గురువారం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆయన ‘అది కేంద్రం. మనది రాష్ట్ర ప్రభుత్వం. ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వానికి భయపడుతుందా? దేశంలో బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల సీఎంలు ఉన్నారు. నేనెందుకు భయపడతాను? ఏ కేసు నాపై ఉంది? ఎక్కడ ఉంది? లేని కేసుపై రామకృష్ణారెడ్డి హైకోర్టుకు వెళ్తే కొట్టేశారు. సుప్రీంకోర్టుకు వెళ్తే పోస్ట్‌చేసి పక్కనపెట్టారు. అసలు కేసేలేని దాన్ని వాళ్లు కేసు ఉందని మాట్లాడుతుంటే మీరు వెనుకంజ వేయడం ఏమిటి? అతని కేసులు స్పీడ్ అవుతున్నాయి కాబట్టి అతను భయపడతాడు. ఏదన్నా భయం ఉంటే అతనికి ఉండాలి గాని, నాకెందుకు భయం? అతను నిండా మునిగాడు, ‘నేనే కాదు ఆయన కూడా’ అని విమర్శించడం ద్వారా కేసుల నుంచి బైటపడాలని చూస్తున్నాడు. నాపై 26 కేసులు అతని తండ్రి వేసి ఏం సాధించగలిగాడ’ని ప్రశ్నించారు. జగన్ అవినీతి రాష్ట్రంలోని ప్రతి వీధికీ తెలియాలని ఆదేశించారు. ‘వారం వారం కోర్టుకెందుకు వెళ్తున్నాడో చెప్పలేడు. తన ఆస్తులు ఏవో, ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పలేడు. తాను ఉంటున్న ఇల్లు కూడా ఎవరిదో చెప్పలేడు. అతని వల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోంది. ఇలాంటి అవినీతిపరుడు ఉంటే కియా లాంటి పరిశ్రమలు వస్తాయా? అవినీతి రహితంగా ఉంటేనే వస్తామని కియా ప్రతినిధులు స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. సమావేశంలో బీజేపీ-వైసీపీ కుమ్మక్కయ్యాయంటూ ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తను చదివి వినిపించారు.
పవన్ పోరాటం రాష్ట్రం కోసమే
పవన్ పోరాటం కూడా మనలాగా రాష్ట్రం కోసమేనని, అతని పద్ధతిలో అతను వెళుతున్నాడని, ఆయన జాక్‌తో వచ్చిన నష్టమేమీ లేదని బాబు వ్యాఖ్యానించారు. దాన్ని స్వాగతించాలన్నారు. ఆయన శే్వతపత్రం అడిగితే సున్నితంగా జవాబివ్వాలన్నారు. ‘మనం ఎప్పటికప్పుడు వివరాలు ప్రకటిస్తున్నాం. పోలవరం వివరాలు వెబ్‌సైట్‌లోనే ఉన్నాయి. ఇక శే్వతపత్రం ఇచ్చేదేముంటుంది? ఇవ్వాల్సివస్తే కేంద్రమే ఇవ్వాలి’ అన్నారు.