ఆంధ్రప్రదేశ్‌

చెయ్య తడిపితేనే పెన్షన్ ఫైలు కదలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: రాష్ట్రంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయాల నుంచి పెన్షన్‌కు అనుమతి పొందటమా... అయ్య బాబోయ్ అంటూ అదిరిపడుతున్నారు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు. ఇక్కడ సిఫార్సులతో సంబంధం లేదు. ఏకంగా అదీ నేరుగా డబ్బుతో మాత్రమే పనులు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ట్రెజరీ పెన్షన్ విభాగాలలో రిటైరైన ఉద్యోగులకు తిప్పలు తప్పటం లేదు. నాడు సర్వీసులో ఉండగా జనాన్ని తిప్పుకున్న ఉద్యోగులు రిటైరైన తరువాత తామే ట్రెజరీ కార్యాలయ ఉద్యోగుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. కొత్తగా రిటైరైన ఉద్యోగులకు చెల్లించాల్సిన పెన్షన్ వివరాలు హైదరాబాద్‌లోని ఏజీ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లా ట్రెజరీలకు అందుతాయి. వాటిని వారం లేదా పది రోజుల వ్యవధిలో రిటైరైన ఉద్యోగులు కోరుకున్న బ్యాంకులకు పంపాలి. ఇక్కడికి రిటైరైన ఉద్యోగులు వ్యక్తిగతంగా వెళ్లి అటెండెన్స్ వేయించుకుంటే తప్ప సకాలంలో ఆ వివరాలు జిల్లా ట్రెజరీ పెన్షన్ విభాగం నుండి బ్యాంకులకు వెళ్లవు. ఇందుకోసం రూ.వెయ్యి నుండి మూడు వేల వరకు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ విభాగంలో నజరానాలు ఇచ్చుకోవాల్సిందే. రిటైర్డ్ ఉద్యోగులు కాళ్లరిగేలా జిల్లాట్రెజరీల చుట్టూ తిరగాల్సిందే. ఎక్కడ కూడా సిటిజన్ ఛార్టర్ సక్రమంగా అమలు చేయడం లేదు. ఏజీ కార్యాలయం నుంచి పెన్షన్ అందిన తేదీ, వాటిని బ్యాంకులకు పంపిన తేదీలతో ఒక నివేదిక ప్రతి నెలా ప్రభుత్వానికి నివేదించాలని మార్గదర్శక సూత్రాలున్నాయి. ఈ విధానం పెన్షన్ విభాగాలలో సక్రమంగా అమలు జరగడం లేదు. ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తే ఏజీ కార్యాలయం నుండి వచ్చే పెన్షన్లు రెండు లేదా మూడు రోజుల వ్యవధిలోనే బ్యాంకులకు పంపే అవకాశం ఉంది. జిల్లాలలో పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులు ఇతర ప్రాంతాలలో స్థిరపడితే తమ పెన్షన్‌ను ఆ ప్రాంతంలోని బ్యాంకులకు బదిలీ చేయాలని కోరవచ్చు. ఇలాంటి ట్రాన్స్‌ఫర్ల పరిస్థితి కూడా ఇంతే. పెన్షన్ విభాగంలో ఉద్యోగులను సంతృప్తి పరచకపోతే పెన్షన్లు అంత త్వరగా ట్రాన్స్‌ఫర్ కావు. నిజానికి వీటికి 15 రోజుల లోపు బదిలీ చేయాలని నిబంధనలు ఉన్నాయి. అయితే ఎలాంటి సమాధానం లేకుండానే నెలల తరబడి వీటిని ఆపుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులకు అడపాదడపా కొన్ని రాయితీలు వచ్చి కలుస్తుంటాయి. తద్వారా పెరిగిన పెన్షన్ మొత్తానికి సంబంధించి రివైజ్డ్ ఆర్డర్ అనుమతి కోసం పెన్షన్ విభాగాల చుట్టూ ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. భర్త చనిపోయిన మహిళలకు ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు. ఇందులో కూడా అంతులోని జాప్యం చోటు చేసుకుంటోంది. ఏ పనిని ఎన్ని రోజులలోగా పూర్తి చేస్తామని చెప్పే సిటిజన్ ఛార్టర్ రాష్ట్రంలోని ఏ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో కూడా లేదు. తమని సంతృప్తిపరచని పక్షంలో రిటైరైన ఉద్యోగులను ముప్పతిప్పలు పెట్టడమే లక్ష్యంగా పెన్షన్ శాఖ పనితీరును చూస్తే అర్థవౌతుంది. అస్తమానం వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా తమ సిబ్బందికి ఈ ఖజానా కంప్యూటరైజేషన్ ద్వారా మెరుగైన సేవలు త్వరితగతిన అందిస్తామని చెప్పుకునే అధికారులు ఈ పరిస్థితులు చక్కదిద్దాల్సి వుంటుంది. ప్రతి పెన్షన్ విభాగంలో రిటైర్డ్ ఉద్యోగులు వారి పనుల నిమిత్తం వచ్చినప్పుడు వెయిటింగ్ హాల్ అవసరం ఉన్నా ఏ జిల్లా ఖజానా కార్యాలయంలో కూడా అవి లేవు. ఈ పరిస్థితులను చక్కదిద్ది అన్ని జిల్లా ట్రెజరీ కార్యాలయాలలో పెన్షన్లు త్వరితగతిన రిటైర్డ్ ఉద్యోగులకు అందేవిధంగా చర్యలు తీసుకోవలసి ఉంది. అసలు నిబంధనల ప్రకారం ముఖ్యంగా ట్రెజరీ శాఖకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో ముందుగా వచ్చిన ఫైల్‌ను ముందుగా క్లియర్ చేసే విధానం వచ్చినపుడు కొంత మేర అవినీతి తగ్గుతుంది. అలాగే ఏసీబీ అధికారులు లంచం ఇచ్చిన సమయంలోనే పట్టుకునే విధానాలను పక్కనబెట్టి ఫైళ్ల కదలికపై కూడా కనే్నసి ఉంచాలి. గత రెండేళ్లుగా రాష్ట్రంలో వివిధ ట్రెజరీ కార్యాలయాల్లో దాదాపు రూ.100 కోట్ల కుంభకోణం జరిగితే ఇటీవల డైరెక్టర్‌గా మోహనరావు వచ్చే వరకు ఏ ఒక్కరిపై చర్య లేదు. అలాగే సరైన విచారణకూడా లేదు. దీంతో వివిధ జిల్లాల్లో రాజకీయ పైరవీలతో కొందరు ఏకమై మోహనరావును సాగనంపే ప్రయత్నం చేస్తున్నారనేది విశ్వసనీయ సమాచారం.