రాష్ట్రీయం

ఎవరిది పైచేయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి సస్పెండయిన వైకాపా ఎమ్మెల్యే రోజా అంశం వివాదాస్పదమవుతోంది. ఈ అంశంలో పాలక ప్రతిపక్షాలు పంతాలు పట్టింపులకు పోతున్న నేపథ్యంలో సమస్య మరింత జటిలమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై సోమవారం అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించడంతో ఏం జరగనున్నదోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ వివాదాన్ని ఇప్పటికే కొందరు న్యాయవ్యవస్థకు, చట్టసభలకు మధ్య వివాదంగా చిత్రీకరిస్తున్న సంగతి ఈ సందర్భంగా గమనార్హం. ఇప్పుడు హైకోర్టు తీర్పును అమలు చేసే విషయంలోనే అసెంబ్లీకి ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. గత శీతాకాల సమావేశాల్లో రోజా సస్పెన్షన్‌ను సభ ఏకగ్రీవంగా తీర్మానించినందున, తాజాగా కోర్టు మధ్యంతర ఉత్తర్వుపై కూడా సభలో చర్చించే నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ భావిస్తోంది.
కోర్టు తీర్పు నేపథ్యంలో రోజా సస్పెన్షన్‌ను రద్దు చేసి, అసెంబ్లీలోకి అనుమతించకుండా అసెంబ్లీ కార్యదర్శి కోర్టులో అప్పీలుకు వెళ్ళారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం సభ తీసుకున్న నిర్ణయంపై కోర్టు జోక్యమేల? అని భావిస్తేనే చిక్కు వస్తుంది. కోర్టు తీర్పును అమలు చేయకపోతే కోర్టు ధిక్కారమవుతుందని వైకాపా భావిస్తుండగా, కోర్టు తీర్పును అమలు చేయకూడదని సభ నిర్ణయం తీసుకుంటే సభలో ఉన్న వారందరినీ ‘్ధక్కారం’ కింద అరెస్టు చేయాల్సిందిగా కోర్టు ఆదేశిస్తుందా? అని పాలకపక్షం సభ్యులు అంటున్నారు.
తీర్పుపై సభలో చర్చించవచ్చా?
కోర్టు తీర్పుపై సభలో చర్చించవచ్చా? అనే కోణంలోనూ పరిశీలన చేస్తున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పులపై చర్చించేందుకు అసెంబ్లీ రూల్స్ ఏమీ లేవు. అయితే తీర్మానాల ప్రతిపాదన అనే రూల్ కింద ఈ అంశంపై చర్చించి తీర్మానం చేసేందుకు అవకాశం ఉంది. గతంలో వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులపై చట్ట సభల్లో చర్చించిన అంశాలను, కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ స్పీకర్లు ఇచ్చిన ‘రూలింగ్’లను వారు పరిశీలిస్తున్నారు. ఎక్కడో వేరే రాష్ట్రంలో ఎందుకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనే జరిగిన ఉదంతాలు ఉన్నాయని అంటున్నారు. 1997 సంవత్సరంలో సింగరేణి బొగ్గు గనుల తవ్వకాల అక్రమాలపై అప్పటి అసెంబ్లీ సభాసంఘాన్ని నియమించగా, కోర్టు అభ్యంతరం చెప్పింది. సభా సంఘాన్ని నియమించే విషయంలో అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోరాదంటూ సభ తీవ్రంగా ప్రతిస్పందించింది. 1985 సంవత్సరంలో జి. నారాయణ స్పీకర్‌గా ఉన్నప్పుడు సుధీర్ కుమార్ అరెస్టు విషయంలో సభ తీసుకున్న నిర్ణయంపై కోర్టు జోక్యం చేసుకున్నప్పుడు నారాయణరావు తీవ్రంగా ఆక్షేపించారు. అయితే ఒక పత్రాకాధిపతి అరెస్టు విషయంలో కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై ఆ పత్రికాధిపతి కోర్టు నుంచి ‘స్టే’ తెచ్చుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కెఆర్ సురేష్‌రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం స్పీకర్‌నుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. అయితే రెండు అసెంబ్లీ సమావేశాలకు మధ్య అరు నెలల మధ్య విరామం ఉండడం, అప్పటికే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో దీనిని ఎవరూ సీరియస్‌గా పట్టించుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరి స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్ ఉన్నప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ డ్రైవర్ మీడియా పాయింట్ వద్ద అప్పటి ఎమ్మెల్యే జెపిపై చేయి చేసుకోవడంతో ఆ డ్రైవర్‌ను స్పీకర్ అరెస్టు చేయించిన సంగతి తెలిసిందే.
యుపిలో కేశవ్ సింగ్ కేసు
1960 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే కేశవ్‌సింగ్‌ను సస్పెండ్ చేసినప్పుడు కోర్టు ఆ సస్పెన్షన్‌ను రద్దు చేయాల్సిందిగా ఆదేశించడంతో, ఆ రాష్ట్ర అసెంబ్లీ శిరసావహించింది. తాజాగా 2013లో తమిళనాడు అసెంబ్లీలో విసి చంద్రకుమార్ కేసులోనూ కోర్టు తీర్పును అసెంబ్లీ శిరసావహించింది.
ఏం జరగబోతోంది?
అసెంబ్లీ రూల్స్‌లోని 340(2) ప్రకారం రోజాను సస్పెండ్ చేయడం వివాదస్పదమైంది. ఈ రూల్ ప్రకారం ఆ సమావేశాల వరకే సస్పెండ్ చేయడానికి వీలుంటుంది. ఇప్పుడు రోజా వ్యవహారంపై సోమవారం అసెంబ్లీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.