ఆంధ్రప్రదేశ్‌

కాపు సంఘ నేతలతో బాబు వీడియో కాన్ఫరెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: కాపు రిజర్వేషన్‌కు సంబంధించి కేంద్రంలోని సిబ్బంది మంత్రిత్వశాఖ (డీఓపీటీ) అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపు రిజర్వేషన్లపై ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూలు సవరించి రిజర్వేషన్లు కల్పించాలని కోరామని కాపు నేతలకు వివరించారు.
మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి: అచ్చెన్నాయుడు
కాపు రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రంలోని డీఓపీటీ అభ్యంతరాల నేపథ్యంలో ఆందోళన అవసరం లేదని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని, కానీ రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూలులో చేర్చి కాపు రిజర్వేషన్లు ఇవ్వవచ్చని వివరించారు. ఈ విషయమై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ నేతలను జేఎఫ్‌సీ సమావేశానికి జనసేన నేత పవన్ కల్యాణ్ పిలవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.