ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో జంతు ప్రదర్శనశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: అమరావతిలో ప్రపంచస్థాయి జంతు ప్రదర్శనశాల ఏర్పాటు చేయడానికి స్థల ఎంపిక, డీపీఆర్‌లు సిద్ధం చేయాలని పీసీసీఎఫ్ మల్లికార్జునరావును మంత్రి శిద్దా రాఘవరావు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో గురువారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. 10వ విడత ఎర్ర చందనం అమ్మకాలకు సంబంధించి ఏప్రిల్ నెలలో టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. జూ అథారిటీ ఆఫ్ ఇండియా (జాప్) రాష్టస్థ్రాయి సమావేశం త్వరలోనే జరుగనుందని, అటవీ శాఖ రాష్ట్ర స్థాయి సమావేశం ఈ నెలాఖరున నెల్లూరులో జరుగనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని అటవీ శాఖ అతిథి గృహాల ఆధునీకరణ పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. అటవీ విస్తీర్ణం వృద్ధిలో (2,141 చ.కి.మీ) దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమస్థానంలో నిలవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ (పీసీసీఎఫ్) మల్లికార్జునరావును ఈ సందర్భంగా అభినందించారు. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో అటవీ విస్తీర్ణం వృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించవలసిందిగా సూచించారు. రాష్ట్రంలోని అన్ని గోడౌన్లలోని ఎర్రచందనం నిల్వలను తిరుపతిలోని గోడౌన్‌కు తరలించడంతో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవల్సిందిగా కోరారు.