ఆంధ్రప్రదేశ్‌

పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జెసి-2 సయ్యద్ ఖాజా మోహిద్దీన్‌ను శాసన మండలి చైర్మన్ ఓఎస్డీగా, ముడ కార్యదర్శి సుబ్బరాజును అనంతపురం జెసి-2గా బదిలీ చేసింది. విజయవాడ శాప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వి.సుబ్బారావును, సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్ కె.ఇ.సాధనను, విశాఖలో జాతీయ రహదారి-16 భూసేకరణ విభాగంలో పన చేస్తున్న ఎ.సుబ్బరాజును సీసీఏల్‌ఏలో అసిస్టెంట్ సెక్రటరీలుగా బదిలీ చేసింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎ.ప్రభావతిని ముడ కార్యదర్శిగా, సీసీఎల్‌ఏలో అసిస్టెంట్ సెక్రటరీ ఎస్.వి.సుబ్బలక్ష్మిని తూర్పు గోదావరి ఆర్డీవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.