ఆంధ్రప్రదేశ్‌

కాపుల్ని బీసీల్లో కలపొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కాపులను బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనకబడిన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్‌కు పలు బిసీ సంఘాలు ఫిర్యాదు చేశాయి. గురువారం నాడు ఏపీలోని పలు బీసీ సంఘాలు రాష్టపతి రామ్‌నాధ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన కాపులను రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పుదుచ్ఛేరి మంత్రి మాల్లాడి కృష్ణ రావు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చవద్దని డిమాండ్ చేశారు. ఏపీలో ఉన్న మత్యకారులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని ఆయన కోరారు. రాష్టప్రతి, రాజ్‌నాథ్ సింగ్‌లను కలిసిన వారిలో గూడూరి వెంకటేశ్వరరావు, పాకా వెంకట సత్యనారాయణ, కొర్రి చిట్టిబాబు తదితరులున్నారు.