ఆంధ్రప్రదేశ్‌

రైతుల ఆందోళనకు టీడీపీ, సీపీఐ దూరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఫిబ్రవరి 15: ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు విస్తరించి ఉన్న సుబాబుల్, జామాయిల్ రైతాంగం నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమానికి రాజకీయ పార్టీల దూరమవుతున్నాయి. సుబాబుల్, జామాయిల్ రైతులకు మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లను 15 రోజుల్లో నిర్ణయిస్తామని రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. హైద్రాబాద్‌లో మంత్రులు హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు ఐటీసీ బీపీఎల్ యాజమాన్యంతో చర్యలు జరిపి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో ఈనెల 16న తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెంలోని ఐటీసీ బీపీఎల్ వద్ద అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనా కార్యక్రమానికి సీపీఐ, తెలుగుదేశం పార్టీలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, నల్గొండ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధిక శాతం మంది రైతులు జామాయిల్, సుబాబుల్‌లను సాగు చేస్తున్నారు. ఐటీసీ బీపీఎల్ యాజమాన్యం దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నదంటూ అన్ని రాజకీయ పార్టీలకు రైతు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. దీంతో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ అనుబంధ రైతు సంఘాలు ఆందోళనకు మద్దతు ఇచ్చాయి. 15రోజులు వెసులుబాటు కల్పించాలంటూ మంత్రులు, ఐటీసీ యాజమాన్యం చేసిన విజ్ఞప్తి మేరకు సీపీఐ, తెలుగుదేశం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తోపాటు పలు రాజకీయ పార్టీలు ధర్నాను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయ.