ఆంధ్రప్రదేశ్‌

కల్యాణం కమనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 16: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి తరువాత ప్రారంభమైన ఆది దంపతుల కల్యాణ వేడుకలు శుక్రవారం తెల్లవారుజాము వరకు వేడుకగా జరిగాయి. ఆలయం నుంచి గజ వాహనంపై గంగాదేవి సమేతుడైన సోమస్కందమూర్తి, సింహ వాహనంపైన జ్ఞాన ప్రసూనాంబ రావడం.. హిమవంతుడితో చండికేశ్వరుడి రాయబారం ప్రక్రియలను అర్చకస్వాములు రక్తికట్టించారు. అప్పటి వరకు కల్యాణ మండపానికి దూరంగా ఉన్న అమ్మవారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి స్వామివారి ఉత్సవమూర్తికి ఎదురుగా వేంచేపు చేసి అర్చకులు పూజను ప్రారంభించగా వేదపండితులు మంత్రోచ్ఛారణతో హోమం జరిపారు. అగ్ని సాక్షిగా ఆదిదంపతుల కల్యాణోత్సవం జరిపారు. నూతన వధూవరులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకోవడం, ఒకరి పూలమాలలను మరొకరు మార్చుకున్న తర్వాతధూప దీప నైవేద్యాలను సమర్పించారు. వివాహ వేడుకల్లో పెండ్లి కుమారుడు అలగడం, పెండ్లి కుమార్తె తరపువారు అలకతీర్చడం సంఘటనలు అర్చకస్వాములు రక్తి కట్టించారు. స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవంతో పాటు సుమారు 60 జంటలు ఒక్కటయ్యాయి.