ఆంధ్రప్రదేశ్‌

చెప్పుల గోదాములో భారీ అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 17: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు లాలాచెరువులో శనివారం ఒక చెప్పుల గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో సుమారు రూ. కోటిన్నరకు విలువైన చెప్పులు దగ్ధమైనట్లు అంచనా వేస్తున్నారు. రెండతుస్థుల గోదాము పైభాగంలో షెడ్డు వేసేందుకు ఇనుప రాడ్లు వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ నిప్పురవ్వలు ఎగిసి మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం లాలాచెరువులో జాతీయ రహదారి పక్కనే ఉన్న భారత్ ట్రేడర్స్ చెప్పుల గోదాములో 3.20 గంటల సమయంలో గోదాము నుంచి పొగలు రావడాన్ని నిర్వాహకులు, స్థానికులు గుర్తించి అగ్నిమాపకశాఖకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. అయితే చెప్పులు రబ్బరుతో చేసినవి కావడంతో మంటలు అదుపులోకి రాలేదు. దీంతో ఇన్నీసుపేట, ఆర్యాపురం ఫైరింజన్లతో పాటు, జగ్గంపేట, పెద్దాపురం నుంచి మొత్తం నాలుగు ఫైరింజన్లను రప్పించినట్లు సంఘటనా స్థలాన్ని సందర్శించిన జిల్లా అగ్నిమాపక సహాయ అధికారి జె రమణయ్య తెలిపారు.