ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ ఎన్నికల హామీలపై పవన్ కళ్యాణ్‌ని అడుగుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 17: టీడీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ, ఫైర్‌బ్రాండ్ సోమువీర్రాజు మరోసారి మండిపడ్డారు. రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం 30 శాతం రాయితీ ఇచ్చినప్పటికీ, ఆ జిల్లాల్లో ముఖ్యమంత్రి ఎన్ని పరిశ్రమలు నెలకొల్పిందీ కేంద్ర ప్రభుత్వానికి సంజాయిషీ చెప్పి, బ్లూప్రింట్ విడుదల చేయాలని డిమాండ్ చేసారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. బీజేపీ సర్కార్, మోదీ, ఆయన కేబినెట్‌పై ఆరోపణలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పేద జిల్లా, తలసరి ఆదాయంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పరిశ్రమ కూడా నాలుగేళ్ళలో ఏర్పాటు చేయకపోవడానికి కారణాలు చెప్పాలన్నారు. రాష్ట్రంలో గల 13 జిల్లాల్లో ఏడు జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి బాబు సర్కార్‌కు ఆయా జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం 30 శాతం రాయితీ ఇచ్చిందన్నారు.
బీజేపీపై ఆరోపణలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలకు ఏం చేసిందన్నారు. చెప్పినవన్నీ చేశామని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న పార్టీ బీజేపీ అన్నారు. ఎన్నికల అమలు చేయడంలో ఏపీలో బాబు సర్కార్ ఏ మేరకు అమలు చేసిందో తాను పవన్‌కళ్యాణ్‌ను అడుగుతానన్నారు. ప్రత్యేక హోదా అంటే రూ. 16000 కోట్ల ఆర్థిక సహాయమని, ఇప్పటి వరకూ ఇచ్చిన రాయితీతో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని పరిశ్రమలు టీడీపీ సర్కార్ ఏర్పాటు చేసిందో సంజాయిషీ చెప్పి, బ్లూ ప్రింట్ విడుదల చేయాలని డిమాండ్ చేసారు. రాజధానిలో 4 నిర్మాణాలకు సంబంధించి మాత్రమే విభజన చట్టంలో ఉందన్నారు. ఏపీ అమరావతికి కేంద్రం రూ. 1600 కోట్లు ఇచ్చిందన్నారు. ఆ నిధులన్నీ ఏమీ చేసారన్నది శే్వతపత్రం విడుదల చేయాలని వీర్రాజు డిమాండ్ చేసారు. బీజేపీ ఏపీలో బలమైన శక్తిగా ఎదుగుతుందేమోననే భయంతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.