ఆంధ్రప్రదేశ్‌

26 నుంచి టెక్నికల్ సర్ట్ఫికెట్ కోర్సు పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: టెక్నికల్ సర్ట్ఫికెట్ కోర్స్ (టీసీసీ) పరీక్షలు ఈ నెల 26 నుంచి మార్చి 1 వరకు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ విఎస్ భార్గవ తెలిపారు. డ్రాయింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్ అండ్ టైలరింగ్, ఎంబ్రాయిడరీలో లోయర్, హయ్యర్ గ్రేడ్‌లలో ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ బీఎస్‌ఈ డాట్ ఏపీ డాట్ జీవోవీ డాట్ ఇన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.