ఆంధ్రప్రదేశ్‌

పవన్ శాసించారు.. సర్కారు పాటించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 17: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరికను ప్రభుత్వం నెరవేర్చింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలు, ఇవ్వాల్సినవి, ఇచ్చిన నిధులకు చేసిన ఖర్చుల వివరాలు ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. దానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 118 పేజీలతో కూడిన ఓ నివేదికను తన దూత ద్వారా జేఎస్పీ కార్యాలయానికి పంపించింది. అయితే ఆ సమయంలో ఆయన లేకపోవడంతో అక్కడి పార్టీ బాధ్యుడికి అందించింది. అందులో బడ్జెట్‌కు ముందు బాబు స్వయంగా ప్రధాని మోదీని కలిసి ఇచ్చిన అభ్యర్థనల వివరాలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, దానిని తాను నియమించిన త్రిసభ్య కమిటీకి ఇవ్వాల్సిందిగా పవన్ కోరారు. దానికి స్పందించిన ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులయిన బాలసుబ్రహ్మణ్యం, ప్రేమచంద్రారెడ్డిని త్రిసభ్య కమిటీకి వాటి వివరాలు తెలిపే బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది. చకా చకా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు పరిశీలించిన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇది మంచిదేనని, స్వాగతించదగ్గదేనని వ్యాఖ్యానించారు. మాజీ ఐఏఎస్ అధికారులైన పద్మనాభయ్య, ఐవైఆర్ కృష్ణారావు, తోట చంద్రశేఖర్‌తో పవన్ త్రిసభ్య కమిటీ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. వారికి సహకరించేందుకే ఇద్దరు ఐఏఎస్‌లను ప్రభుత్వం నియమించింది.