తెలంగాణ

ఇక ఒకే ట్రిబ్యునల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: జల వివాదాలపై జాతీయస్థాయిలో ఒకే టిబ్య్రునల్ ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర జలవనరులశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు. మార్చిలో జరిగే రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్టు చెప్పా రు. జాతీయస్థాయి ట్రిబ్యునల్ ఏర్పాటు తరువాత రాష్ట్రాల, నదులవారీ ట్రిబ్యునళ్లకు స్వస్తి పలుకుతామని స్పష్టం చేశారు. కేంద్ర జల వనరులశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల జలవనరుల సదస్సు జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, పాండిచ్చేరి, కేరళ ఆరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులతోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశం అనంతరం అర్జున్‌రామ్ మీడియాతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల జల వనరుల తొలి సమావేశం జయప్రదంగా ముగిసిందన్నారు. సమావేశాన్ని హైదరాబాద్ డిక్లరేషన్‌గా పిలువచ్చని అర్జున్‌రామ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రా ల మధ్య జల వివాదాలను సత్వరం పరిష్కరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావిస్తున్నారన్నారు. జల వివాదాల పరిష్కారం ప్రధాని ప్రాధాన్యతల్లో ఒకటన్నారు. క్షేత్రస్థాయిలో నదీ జలాలపై అవగాహన చేసుకోవడంతోపాటు వివాదాల పరిష్కారానికి కార్యాచరణను ఖరారు చేయడానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ సూచనతో తొలిసారిగా దక్షిణాది రాష్ట్రాల జల వనరుల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సదస్సు సాధారణ సమావేశం కాదని, ఇందులో చేసే తీర్మానాలతో వివాదాల పరిష్కారం దిశగా రోడ్ మ్యాప్ తయారు చేస్తామన్నారు. తమిళనాడు, కర్నాటకల మధ్య కావేరీ జల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రెండు నెలల్లో కావేరీ రివర్ మేనేజిమెంట్ బోర్డు, కావేరి రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను మరింత జటిలం చేయవద్దని దక్షిణాది రాష్ట్రాలకు సూచించినట్టు తెలిపారు. రాష్ట్రాల మధ్య జల వివాదాలు జాతీయ అభివృద్థికి ఆటంకమని మంత్రి అభిప్రాయపడ్డారు. జల వివాదాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. కోర్టులు, ట్రిబ్యునళ్లవల్ల సమస్య మరింత జటిలం అవుతుంది తప్ప సత్వర పరిష్కారం లభించదని మంత్రి హితవు పలికారు. రాష్ట్రాలలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు పెంచుతామన్నారు. అలాగే నాబార్డు, ప్రపంచ బ్యాంకు వంటి ఆర్థిక సంస్థల ద్వారా వీటికి నిధులు ఇప్పించనున్నట్టు కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ తెలిపారు.
chitram...
దక్షిణాది రాష్ట్రాల జలవనరుల సదస్సులో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి మేఘ్వాల్