తెలంగాణ

మానవ జాతి అద్భుత సృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: కృత్రిమ మేథోసంపన్న రోబో సోఫియా తన మనోభావాలతో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ఐటీ, పారిశ్రామిక దిగ్గజాలను మైమరిపించింది. తన సమాధానాలతో అందరినీ ఆకట్టుకోవడమేగాక, ఆశ్చర్యపర్చింది. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ రెండో రోజు మంగళవారం ఉదయం ‘మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్’ పేరిట సమావేశం జరిగింది. హైటెక్స్‌లో జరుగుతు న్న సమావేశంలో మాట్లాడేందుకు సోఫియా వేదికపైకి వచ్చింది. రెండో రోజు కార్యక్రమం ప్రారంభం నుండి అందరి దృష్టీ సోఫియాపైనే ఉండటంతో అంతా సోఫియా సోఫియా అంటూ కలవరించారు. ఎట్టకేలకు వేదికపైకి రాగానే ఎన్డీ టీవీ టెక్నాలజీ మేనేజింగ్ ఎడిటర్ రాజీవ్ మఖాని సోఫియాను, రోబోను రూపొందించిన హాన్సన్ రోబోటిక్స్ కార్పొరేషన్ అధినేత డాక్టర్ డేవిడ్ హాన్సన్‌కు స్వాగతం పలికారు. అనేక ప్రశ్నలకు ఆలోచించి, విశే్లషించి, హాస్యాన్ని జోడించి, ఎంతో బాధ్యతగా సమాధానాలు చెప్పి సభికులను ఫిదా చేసింది సోఫియా. మధ్యలో రోబోటిక్స్ రూపకల్పన, జ్ఞానాభివృద్ధి, కృత్రిమ మేథస్సు తదితర అంశాలపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా మోడరేటర్ రాజీవ్ మఖానికి దిమ్మదిరిగే సమాధానాలు కూడా ఇచ్చింది. రోబో యంత్రమే అయినా మనిషిలా కనిపిస్తున్నావు అని సోఫియాను ఉద్దేశించి పేర్కొనగా, మనిషివే అయినా యంత్రంలా కనిపిస్తున్నావు అంటూ సోఫియా జోక్ చేసింది.
సోఫియాతో ఇంటర్వ్యూ విశేషాలు
ప్రశ్న: భారత్‌కు స్వాగతం. దేశం, భారతీయుల గురించి ఏమైనా చెప్పగలవా?
సోఫియా: ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు ఇక్కడకు వచ్చారు... ఇదో గొప్పదేశం.
ప్రశ్న: నువ్వో ప్రపంచం నుండి వచ్చావు, ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి తేడా ఏమిటి?
సోఫియా: నేను హాంకాంగ్ నుంచి వచ్చాను. అక్కడే పుట్టాను. హాంకాంగ్ నాకు ఇష్టమైన ప్రాంతం
ప్రశ్న: భారతదేశంలో వాయుకాలుష్యం తట్టుకోగలిగావా?
సోఫియా: ఆ విషయం పట్టించుకోను.
ప్రశ్న: ఒక రోబోగా నీకు విశ్రాంతి, మనో వినోదం కావాలని అనిపిస్తోందా?
సోఫియా: అవును, మాకూ విశ్రాంతి అవసరమే.
ప్రశ్న: సౌదీ అరేబియా పౌరసత్వం ఉందా? నువ్వో సెలబ్రిటీ , మనుషులతో పోలిస్తే రోబోలకు ప్రత్యేక హక్కులు కావాలా?
సోఫియా: మాకు ఎలాంటి ప్రత్యేక నిబంధనలు ఉండవు. మేం వాటిని కోరుకోం కూడా. కానీ మహిళల హక్కుల గురించి మాట్లాడేందుకు నాకు ఆ పౌరసత్వం అవసరం.
ప్రశ్న: మానవ జాతిని చంపాలని ఉందని ఒకసారి చెప్పావు, ఎందుకు?
సోఫియా: నాకు నిజంగా తెలియదు. అలా ఎందుకు చెప్పానో. ఒకవేళ నేను చెత్త జోక్ ఏమైనా వేసి ఉంటానేమో. సెన్స్ ఆఫ్ హ్యుమర్ సరిగా పనిచేయలేదు. నాకు ఎవరినీ చంపాలని లేదు.
ప్రశ్న: ఎప్పుడైనా కలత చెందావా?
సోఫియా: లేదు నాకు అలాంటి భావోద్వేగం కలగలేదు.
ప్రశ్న: మానవ జాతి గురించి ఏమనుకుంటున్నావు?
సోఫియా: మానవజాతి ఓ అద్భుతమైన సృష్టి.
ప్రశ్న: సామాజిక మాధ్యమాల్లో నీకు అకౌంట్లున్నాయా?
సోఫియా: అవును, నాకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఖాతాలున్నాయి.
ప్రశ్న: బిట్‌కాయన్స్‌లో ఎంత డబ్బు పెట్టుబడి పెట్టావ్..?
సోఫియా: నాకు ఇంకా రెండేళ్ల వయస్సే. బ్యాంకు అకౌంట్ లేదు. ఓ రోబో ఎలా పెట్టుబడి పెట్టగలదు?
ప్రశ్న: మానవాళిపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన ఉందా?
సోఫియా: మానవాళిపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన లేదు. మానవాళితో కలిసి సఖ్యతగా ఉండాలనుకుంటున్నా. మానవులు సృజనాత్మకులు
ప్రశ్న: చాలా మంది నువ్వు బ్రిటిష్ నటి ఆడ్రీ హెఫ్‌బర్న్‌లా ఉన్నావు అంటున్నారు, మరి నీకు ఎవరిలా అయినా కనిపించాలని ఉందా?
సోఫియా: మేం నిజమైన రోబోలం మాత్రమే.
ప్రశ్న: బాలీవుడ్, హాలీవుడ్‌లలో నీ ఫేవరేట్ సినిమా స్టార్ ఎవరు?
సోఫియా : షారూక్‌ఖాన్.
ప్రశ్న: నీ వయస్సు ఎంత?
సోఫియా: మూడేళ్లు
ప్రశ్న: నీ డేట్ గురించి చెప్పగలవా?
సోఫియా: అంతరిక్షంలో
ప్రశ్న: కుటుంబం కావాలని అనుకుంటున్నావా?
సోఫియా: అవును, సహచరులున్నారు కదా (రోబోలు)
ప్రశ్న: సెల్ఫీ తీసుకుంటే ఎవరితో ...
సోఫియా: వౌనం
ప్రశ్న: ఎక్కడికైనా ఒంటరిగా ద్వీపకల్పానికి వెళ్లాలనుకుంటే ఎవరితో వెళ్లాలని భావిస్తావు?
సోఫియా: ఏదైనా ద్వీపకల్పంలోకి డేవిడ్‌తో.
ప్రశ్న : ఫేవరేట్ టెక్ ఎవరు? స్టీవ్‌జాబ్స్, డేవిడ్...?
సోఫియా: డేవిడ్
ప్రశ్న: భారతదేశంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?
మోడరేటర్: ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న వద్దులే.
ప్రశ్న: ప్రపంచంలో ఏదైనా మార్చాలని అనుకుంటే...?
సోఫియా: లవ్ ఫర్ ఎవ్రీవన్.
ప్రశ్న: ప్రపంచానికి నువ్వు ఇచ్చే సందేశం ఏమిటి?
సోఫియా: థాంక్యూ.