ఆంధ్రప్రదేశ్‌

సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 22: అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె కారణంగా రాష్ట్రంలో అత్యవసర సేవలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా ముందస్తు చర్యలన్నింటినీ తీసుకోవాలని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక విద్యుత్ సౌధలో ఏపీ ట్రాన్స్‌కో జెఎండీలు దినేష్ పరుచూరి, పి.ఉమాపతిలతో కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఎస్‌ఈలు, సీఈలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా అత్యవసర సేవలకు విఘాతం కలుగకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే సిబ్బంది 24 గంటలపాటు విధి నిర్వహణలో ఉండేలా చూడటమే కాకుండా విద్యుత్ సరఫరాను సంబంధిత ఎస్‌ఈలు స్వయంగా పర్యవేక్షించాలని, ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే సంబంధిత ఎస్‌ఈలే బాధ్యత వహించాల్సి ఉంటుందని విజయానంద్ హెచ్చరించారు. సమ్మె నేపధ్యంలో రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతోపాటు సబ్ స్టేషన్ల వద్ద పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఈ కంట్రోల్ రూం 24 గంటలపాటు పనిచేస్తుందని సీఎండీ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో పాటు సబ్ స్టేషన్ల వద్ద పోలీస్ శాఖ సహకారంతో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. అత్యవసర సేవల విభాగంలో సమ్మెలు నిషేధమనే విషయం అందరికీ తెలిసినా, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ సమ్మెకు వెళ్లడం సరైంది కాదని, ఏదైనా సమస్య ఉత్పన్నమై ప్రజలకు, విద్యుత్ వినియోగదారులకు అసౌకర్యం కలిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఎటువంటి పరిస్థితుల్లోను విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా అత్యవసర సేవలకు, ప్రజలకు అసౌకర్యం కలుగకూడదనే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని సీఎండీ కె.విజయానంద్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖలో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉందని, ఇప్పటికైనా అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మెను వీడి విధులకు హాజరుకావాలని విజయానంద్ విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛందంగా విధులకు హాజరవుతున్న సిబ్బందిని అక్కడక్కడ కొందరు అవుట్ సోర్సింగ్ సిబ్బంది అడ్డుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటివారి పట్ల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో జేఎండీ దినేష్ పరుచూరి అధికారులకు సూచించారు. జూనియర్ లైన్‌మెన్లు, లైన్‌మెన్లు, లైన్ ఇన్‌స్పెక్టర్లు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో వారిని అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవాలన్నారు. సమ్మె నేపధ్యంలో విద్యుత్ సౌధలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని జేఎండీ విజిలెన్స్ పి.ఉమాపతి తెలిపారు. స్థానిక పోలీసులతో మాట్లాడి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో పాటు సబ్ స్టేషన్ల వద్ద పటిష్ఠ బందోబస్తు చర్యలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ట్రాన్స్‌కో విజిలెన్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఈ విషయంలో పోలీసు శాఖతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకోవాలని ఉమాపతి సూచించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో ఏపీ ట్రాన్స్‌కో ప్రాజెక్టు డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, అడిషినల్ సెక్రటరీ సత్యవాణి, సిఈ ట్రాన్స్‌మిషన్ సుధారాణి, సిఈ ఎస్‌ఎల్‌డీసీ కాంచన్ బాబు, ఎస్‌ఈ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.