ఆంధ్రప్రదేశ్‌

‘విద్యుత్’ సమ్మె ఇక ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలోని 24వేల మంది విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ప్రధాన డిమాండ్లయిన డైరెక్ట్ పేమెంట్, దశలవారీ క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, పీస్ రేటు రద్దు కోసం చేపట్టిన సమ్మె గురువారం 3వ రోజుకు చేరింది. 13 జిల్లాల్లో కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మె తీవ్రంగా జరుగుతున్నా ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా మొండిగా వ్యవహరించడాన్ని ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఖండించింది. తక్షణం ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఒక ప్రకటనలో ఏపీ విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. విద్యుత్ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇక సమ్మెను ఉద్ధృతం చేయనున్నట్టు హెచ్చరించింది. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని పేర్కొంది. శుక్రవారం విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలతో జిల్లా కేంద్రాల్లో మహా ప్రదర్శనలు, 24న కాంట్రాక్టు కార్మికులు, ప్రజా సంఘాలు కలిపి మానవహారాలు, 25న అన్ని జిల్లాల్లో నిరవధిక దీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్టు ఆ ప్రకటనలో తెలిపారు.